స్నానం ఎలా చేయాలి?
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:33 AM
శరీరం పరిశుభ్రంగా ఉండాలంటే స్నానం తప్పనిసరి. ప్రతిరోజూ సరైన పద్ధతిలో స్నానం చేయని పక్షంలో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేయాల్సిన విధానం గురించి...

స్నానం ఎలా చేయాలి?
శరీరం పరిశుభ్రంగా ఉండాలంటే స్నానం తప్పనిసరి. ప్రతిరోజూ సరైన పద్ధతిలో స్నానం చేయని పక్షంలో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేయాల్సిన విధానం గురించి ఇలా తెలియజేస్తున్నారు.
స్నానానికి మరీ చల్లటి నీళ్లు, మరీ వేడి నీళ్లు ఉపయోగించకూడదు. నీళ్లు ఒంటిపై పోసుకోగానే హాయి కలిగే విధంగా ఉండాలి. ఏ కాలంలో నైనా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
ముందుగా ముఖం, కాళ్లు, చేతులను నీటితో తడపాలి. తరవాత మిగిలిన శరీర భాగాలు తడిసేలా నీరు పోసుకోవాలి.
స్నానానికి సబ్బు తప్పనిసరి. అయినప్పటికీ శరీరాన్ని ఎక్కువగా సబ్బుతో రుద్దకూడదు. అలా చేస్తే చర్మం పొడిబారుతుంది. ముందుగా చేతులతో సబ్బు నురుగు తీసుకుని దాంతో ముఖాన్ని రుద్దుకొని వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలి. తరవాత మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, వీపు, పొట్టను సబ్బుతో రుద్దుకోవాలి. ముఖం మీదనుంచి నీళ్లు పోసుకుంటూ సబ్బు పూర్తిగా వదిలేలా శరీర భాగాలను తోముకోవాలి. చివరగా కాళ్లు, పాదాలు, వేళ్లను సబ్బుతో రుద్ది అది పూర్తిగా వదిలేవరకు నీళ్లు పోసుకుంటూ తోముకోవాలి.
తలస్నానం చేసేటప్పుడు ముందుగా శరీర భాగాలను నీళ్లతో తడిపి ఆ తరవాతనే తలపై నీళ్లు పోసుకోవాలి. అలా కాకుండా ఒక్కసారిగా తలపై నీళ్లు కుమ్మరించుకుంటే తలనొప్పి వస్తుంది. ముందుగా తలకు షాంపూ పట్టించి రెండు నిమిషాలు ఆగాలి. తరవాత తలపై నీళ్లు చిలకరించుకుంటూ శిరోజాలకు అంటిన షాంపూను వదిలించాలి. తల మొత్తాన్ని నీళ్లతో శుభ్రం చేసుకున్న తరవాతనే శరీర భాగాలకు సబ్బు పట్టించాలి. ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. వారానికి రెండుసార్లు చేస్తే చాలు.
వేసవికాలంలో ఉదయం నిద్ర లేవగానే చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. పగలంతా బయట పనులతో అలసిపోయి ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..