పరీక్షల ముందు ఇలా చదవండి
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:08 AM
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మొదలు కాబోతున్నాయి. రెండు రాష్ర్టాల్లో కలిపి గత సంవత్సరం సుమారు 10 లక్షల మంది పదో తరగతి, 12 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ సంవత్సరం కూడా...

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మొదలు కాబోతున్నాయి. రెండు రాష్ర్టాల్లో కలిపి గత సంవత్సరం సుమారు 10 లక్షల మంది పదో తరగతి, 12 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. సమగ్రమైన ప్రణాళిక, సమయ నిర్వహణతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విద్యా నిపుణులు చెబుతున్నారు. బోర్డు పరీక్షల మార్కులు ఉన్నత విద్యా అవకాశాలను నిర్ణయిస్తాయి. ప్రిపరేషన్ బాగుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షా హాల్‌లో సమయం సరిపోతుంది. అలాగే సరైన స్టడీ ప్లాన్, రివిజన్, మాక్ టెస్టులు రాయడం వల్ల బాగా గుర్తుంటాయి. టాపర్ల టిప్స్ అనుసరించడం, తప్పులు తగ్గించడం ఉత్తమ ఫలితాలకు దోహదం చేస్తాయి. పరీక్షలకు ఉన్న ఈ కొద్ది రోజుల్లో స్మార్ట్ వర్క్ ముఖ్యం అంటున్నారు నిపుణులు...
ప్లానింగ్ ముఖ్యం
1. తప్పక చదవాల్సిన చాప్టర్లను గుర్తించండి. బోర్డు పరీక్షలలో ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ తెలుసుకోండి.
2. రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోండి. ప్రతి రోజు చదవడానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించండి.
3. చిన్న చిన్న లక్ష్యాలను నిర్థారించుకోండి. కష్టమైన సబ్జెక్టులో ఒక్కో రోజు ఒక హార్డ్ ఛాప్టర్, ఈజీ చాప్టర్ లేదా ముఖ్యమైన టాపిక్స్ పూర్తిచేయండి.
4. సమయం వృధా చేయొద్దు. మొబైల్, టీవీ వంటి దృష్టి మళ్లించే విషయాలను తగ్గించాలి.
5. కనీసం 6-8 గంటలు నిద్ర ముఖ్యం.
మంచి మార్కుల చిట్కాలు
6. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలు, డయాగ్రామ్స్ ఒక దగ్గర రాసుకోండి.
7. రివిజన్ చేయండి. ఒకే విషయాన్ని పదే పదే చదివితే మరచిపోయే ప్రసక్త లేదు.
8. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయండి. గత 5-10 ఏళ్ల ప్రశ్నపత్రాలను రాసి ప్రాక్టీస్ చేయండి. అకడమిక్ పరీక్షల్లో ఇవే దాదాపుగా రిపీట్ అవుతుంటాయి.
9. పరీక్షల్లో టైమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యం. మాక్ టెస్ట్ రాయడం ద్వారా లోటుపాట్లను అధిగమించవచ్చు.
సబ్జెక్టుకు ఒక వ్యూహం
10. మేథ్స్ రోజూ ప్రాక్టీస్ చేయాలి. రోజుకు కనీసం 10-15 ముఖ్యమైన లెక్కలు సాల్వ్ చేయండి.
11. సైన్స్ విషయంలో ఫార్ములాలు, డయాగ్రామ్స్, ఈక్వేషన్స్, రియాక్షన్స్ ఒక దగ్గర రాసుకుని ప్రాక్టీసు చేయండి.
12. సోషల్ స్టడీ్‌సలో డేట్స్, ఈవెంట్స్ ముఖ్యం. కథల మాదిరిగా చదివి అర్థం చేసుకోవడం ఉత్తమం.
13. ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో వ్యాకరణం ప్రాక్టీస్ చేయండి. ముఖ్యమైన వ్యాకరణ నియమాలను రాసి చదవండి.
14. స్మార్ట్ స్టడీ మెథడ్స్ ఉపయోగించండి.
పరీక్ష రోజు
15. తక్కువ ఒత్తిడితో చదవండి. కొండను ఎత్తుకుంటున్నట్లుగా కాకుండా ఆసక్తిగా చదవండి.
16. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజుకు 10 నిమిషాలు ధ్యానం, యోగా వంటివి చేయండి.
17. ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని పెంచండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు చురుకుగా ఉంటుంది.
18. పరీక్ష ముందు రోజు కొత్త విషయాలు చదవొద్దు. రివిజన్ మాత్రమే చేయాలి.
19. పరీక్ష రోజు ప్రశాంతంగా ఉండండి. సమయం కంటే ముందే హాల్‌కు చేరుకోండి. ఇతరులు ఎలా చదివారు, ఎంత చదివారు అనే విషయాలపై చర్చ వద్దు. ప్రశాంతంగా ప్రశ్నపత్రం చదివి సమాధానాలు రాయండి.
డాక్టర్ పవన్‌కుమార్ కాసు
సమాధానాలు రాసేప్పుడు
1. ప్రశ్నను పూర్తిగా చదవండి. తొందరలో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముఖ్యంగా ‘ఎక్స్‌ప్లెయిన్, కంపేర్, డిస్ర్కైబ్’ వంటి పదాలు గమనించండి.
2. టైమ్ ప్లానింగ్ ముందే చేసుకోండి. చిన్న ప్రశ్నలకు తక్కువ సమయం, దీర్ఘ సమాధానాలకు ఎక్కువ సమయం పక్కాగా పాటించండి. బాగా వచ్చు కదా అని చిన్న ప్రశ్నకు ఎక్కువ సమయం తీసుకుని చివర్లో ఇబ్బంది పడొద్దు.
3. స్పష్టమైన, క్రమబద్థమైన రాత ముఖ్యం. సమాధానాన్ని పాయింట్స్‌గా రాయండి. ఎక్కువ పేరాలు అన్నట్లు కాకుండా లాజికల్ ఫ్లోలో ఉండేలా చూసుకోండి.
4. ముఖ్యమైన పాయింట్లకు అండర్‌లైన్ చేయండి. ఆయా పదాలను హైలైట్ చేయడం వల్ల పరిశీలకుడు సమాధానం స్పష్టంగా చూడగలుగుతాడు.
5. తగిన డయాగ్రామ్స్, చార్ట్‌లు వాడండి. ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ, జాగ్రఫీ వంటి సబ్జెక్టులకు సరైన పటాలు, డయాగ్రామ్స్ గీయండి.
6. తప్పులు తగ్గించేందుకు స్పష్టమైన భాష వాడండి. అపరిపక్వమైన పదజాలం, క్లిష్టమైన వ్యాకరణాన్ని ఉపయోగించ వద్దు.
7. లెక్కలు, సైన్స్‌ల్లో స్టెప్ బై స్టెప్ ఆన్సర్ రాయండి. నేరుగా సమాధానం రాయకుండా, ప్రతి స్టెప్ చూపించి రాయడం వల్ల పూర్తి మార్కులు వస్తాయి.
8. మినిమమ్, మాగ్జిమమ్ లిమిట్స్‌లో రాయండి. రెండు మార్కుల ప్రశ్నకు 10 లైన్లు రాయడం, 5 మార్కుల ప్రశ్నకు 3 లైన్లు రాయడం తప్పు. సరిపడే సమాచారం అందించండి.
9. చివర్లో సమాధానాలు చెక్ చేసుకోండి. తప్పులు సవరించుకునేందుకు చివరి 5-10 నిమిషాలు కేటాయించండి.
10. పేపర్‌ను క్లీన్‌గా ఉంచండి. అర్థం కాని రాత, ఎక్కువ సార్లు కొట్టివేతలు, స్ర్కిబ్లింగ్ ఉండకుండా చూసుకోవాలి.
Read More Business News and Latest Telugu News