Share News

డైనింగ్‌ టేబుల్‌ అందంగా ఇలా...

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:36 AM

సాధారణంగా డైనింగ్‌ టేబుల్‌ మీద మంచినీళ్ల గ్లాసులు, వాటర్‌ బాటిల్స్‌, పళ్లేలు ఇలా ఎన్నెన్నో పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డైనింగ్‌ రూమ్‌ అందం పాడవుతుందని...

డైనింగ్‌ టేబుల్‌ అందంగా ఇలా...

డైనింగ్‌ టేబుల్‌ అందంగా ఇలా...

సాధారణంగా డైనింగ్‌ టేబుల్‌ మీద మంచినీళ్ల గ్లాసులు, వాటర్‌ బాటిల్స్‌, పళ్లేలు ఇలా ఎన్నెన్నో పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డైనింగ్‌ రూమ్‌ అందం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. డైనింగ్‌ టేబుల్‌ను ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

  • డైనింగ్‌ టేబుల్‌ మీద తప్పనిసరిగా టేబుల్‌ క్లాత్‌ వేయాలి. కాటన్‌, సిల్క్‌, రేయాన్‌, జూట్‌, పాలిస్టర్‌ క్లాత్‌లను ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసినవి, పెద్ద ప్రింట్లు ఉన్నవి అయితే టేబుల్‌కు రిచ్‌ లుక్‌ వస్తుంది.

  • డైనింగ్‌ టేబుల్‌ చుట్టూ అమర్చిన కుర్చీల ముందు టేబుల్‌పై మ్యాట్‌లు వేయాలి. వీటి వల్ల టేబుల్‌ క్లాసీగా కనిపిస్తుంది. కాటన్‌ లేదా నారతో తయారు చేసిన మ్యాట్‌లు..... టేబుల్‌పై చక్కగా అమరుతాయి. రకరకాల రంగుల్లో పలు డిజైన్లతో ఉన్న మ్యాట్‌లు ఎంచుకుంటే టేబుల్‌ అందంగా కనిపిస్తుంది.

  • డైనింగ్‌ టేబుల్‌కు క్యాండిల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టేబుల్‌ ముందు కుర్చీలో కూర్చున్నప్పుడు కంటి ఎత్తు కంటే కిందుగా క్యాండిల్స్‌ అమర్చాలి. టేబుల్‌ మధ్యలో ఓ పెద్ద క్యాండిల్‌ పెడితే చూడడానికి బాగుంటుంది. టేబుల్‌ మధ్యలో ఫ్లవర్‌ వాజ్‌ను ఉంచి దాని చుట్టూ రంగురంగుల క్యాండిల్స్‌ పెడితే ఆకర్షణీయంగా ఉంటుంది.


  • డైనింగ్‌ టేబుల్‌ గుండ్రంగా ఉన్నట్లయితే రూఫ్‌ నుంచి ఓ పెద్ద పెండాంట్‌ లైట్‌ వేలాడేలా అమర్చుకుంటే బాగుంటుంది దీర్ఘచతురస్రాకారపు టేబుల్‌ అయితే రెండు లేదా మూడు వరుసల్లో పెండాంట్‌ లైట్లను అమర్చుకోవచ్చు. అందమైన షాండ్లియర్‌ ఏర్పాటు చేసుకుంటే డైనింగ్‌ టేబుల్‌ రిచ్‌గా కనిపిస్తుంది.

  • డైనింగ్‌ టేబుల్‌ మీద ఓ పక్కగా చిన్న మొక్క ఉన్న పింగాణీ కుండీని పెడితే చూడడానికి బాగుంటుంది.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..

గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..

Updated Date - Mar 31 , 2025 | 04:36 AM