రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు..
ABN, Publish Date - Mar 31 , 2025 | 09:47 AM
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.

రంజాన్ పండుగకు మరోపేరు ఈద్ ఉల్ ఫి తర్. ఈనెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉప వాసాలు ఫిత్ర జకాత్, దానధర్మాలు చేస్తుంటారు.

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు సాంస్కృతిక వికా సానికి దోహదం చేస్తుంటాయి.

పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేహం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది.

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు.

చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్లో శివనెల రంజాన్. దీన్ని ముస్లింలు పవిత్రమైనదిగా భావిస్తారు. దాన ధర్మాలకు ప్రత్యేక స్థానం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్ధనలు, కఠిన రోజా ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది.

మహ్మద్ ప్రవక్తలా ఇల్లాహ ఇల్లాలు అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాండేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్టు చరిత్ర చెబుతుంది.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు విధిగా దానధర్మాలు చేసిన ప్పుడే అల్లా కరుణిస్తాడు. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని విధిగా పఠించాలి. పఠించలేని వారు వినాలి. ముస్లింలు తమ సంపాదనలో భాగంగా బంగారం, వెండి, ఇతర ఆదాయాల మీద జకాత్ తమనిసరిగా తీసి పేదలకు పంచాలి.
Updated at - Mar 31 , 2025 | 10:08 AM