Tenth Exams: ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.. సంబరంగా ఇంటి బాటపట్టిన హాస్టల్ విద్యార్థులు
ABN, Publish Date - Apr 02 , 2025 | 06:39 PM
Tenth Exams: విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షలు నేటితో పూర్తయ్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన ఈ పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే పదో తరగతి పరీక్షలు బుధవారంతో పూర్తయ్యాయి.

మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ మొత్తం 2,650 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. 5,09,403 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

బుధవారంతో జరిగిన సోషల్ పరీక్షతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగిపోయారు.

పరీక్షలు పూర్తికావడంతో హాస్టళ్లో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. కాగా, టెన్త్ పరీక్షా ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదలవుతాయని సమాచారం.

ఈ నెల 3, 4 తేదీల్లో ఓరియంటల్ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు జరుగుతాయి. వీటికి కొంతమంది విద్యార్థులే హాజరవుతారని అధికారులు వెల్లడించారు.
Updated at - Apr 02 , 2025 | 06:40 PM