Drinking Tea : టీ తాగితే నిజంగా నిద్ర రాదా..నిజమిదే..
ABN, Publish Date - Mar 24 , 2025 | 08:48 PM
Tea Sleep Connection : భారతదేశంలో అందరూ ఇష్టంగా తాగే పానీయాల్లో టీ ఒకటి. ఇది తాగకుండా రోజువారీ పనులను మొదలుపెట్టేవారు తక్కువే. మరీ ముఖ్యంగా రాత్రివేళ మేలుకోవాలని అనుకునేవారు అదే పనిగా చాయ్ తాగుతుంటారు. ఇంతకీ, టీ తాగితే నిజంగానే నిద్రరాదా..

భారతదేశంలో టీ ప్రియులకు కొరత లేదు. చాలా మంది ఉదయం ఒక కప్పు వేడి టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అతిథులు ఇంటికొచ్చినా, అలసటగా అనిపించినా, నిద్ర రాకుండా ఉండటానికి టీ కే ఓటేస్తారు.

టీ తాగడం వల్ల నిద్ర ఎందుకు రాకుండా పారిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.

టీలో కెఫిన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ శరీరంలోకి చేరుకోగానే ఆటోమేటిగ్గా మెదడు ఉత్తేజితమవుతుంది. వెంటనే నిద్రమత్తు వదిలి ఉత్సాహంగా ఉన్న అనుభూతికి లోనవుతాం.

కెఫిన్ వల్ల మనం టీ తాగినప్పుడు నిద్రతో పాటు అలసట కూడా పోతుంది. మనల్ని ఉత్సాహం ఆవరిస్తుంది. అయితే, తప్పు సమయంలో ఎక్కువ టీ తాగడం వల్ల మీ స్లీపింగ్ సైకిల్ దెబ్బతింటుంది. అలాగే, మీరు అనేక వ్యాధుల బారిన పడవచ్చు.

టీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం. ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన పెరిగిపోతాయి. అధిక మొత్తంలో కెఫిన్ మీ మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

రాత్రి టీ తాగిన తర్వాత నిద్ర పోవడం కూడా చాలా హానికరం. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండటానికి 7 నుంచి 8 గంటల పాటు కచ్చితంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం.

టీలో నికోటిన్ కూడా ఉంటుందని మీకు తెలుసా. నికోటిన్ ఆరోగ్యానికి ఎంత కలిగిస్తుందో మీకు తెలుసు. అందుకే టీని ఎక్కువగా తాగేవారు దానికి బానిస అవుతారు. అలవాటు ప్రకారం తాగకపోతే తల్లడిల్లిపోతారు.
Updated at - Mar 24 , 2025 | 08:50 PM