Share News

ఏదైనా పది నిమిషాల్లోనే...

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:04 AM

కొన్ని నెలలకు తమ కాలనీకి దగ్గరగా ఉన్న జూహూ, బాంద్రాలకు కూడా వారి సేవల్ని విస్తరించారు. అందుకోసం ‘కిరాణాకార్ట్‌’ యాప్‌ను ఏర్పాటుచేసి స్థానిక రిటైలర్స్‌తో ఒప్పందం చేసుకుని లాభాలు గడించారు.

ఏదైనా పది నిమిషాల్లోనే...

నగరాల్లో ఉండేవారికి ‘జెప్టో’ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏదైనా ఆర్డర్‌ ఇచ్చిన పదంటే ‘పది’ నిమిషాలకే డెలివరీ చేస్తూ దూసుకెళ్తోంది. కరోనా కాలంలో ఇద్దరు కుర్రాళ్ల ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ‘జెప్టో’ మార్కెట్‌ విలువ కేవలం మూడేళ్లలో అక్షరాలా పదివేల కోట్ల రూపాయలు. ఆసక్తి కలిగించే వారి విజయప్రస్థానమిది...

కొన్ని నెలలకు తమ కాలనీకి దగ్గరగా ఉన్న జూహూ, బాంద్రాలకు కూడా వారి సేవల్ని విస్తరించారు. అందుకోసం ‘కిరాణాకార్ట్‌’ యాప్‌ను ఏర్పాటుచేసి స్థానిక రిటైలర్స్‌తో ఒప్పందం చేసుకుని లాభాలు గడించారు.


book6,2.jpg

ఆదిత్య పలిచా, కైవల్య వోహ్రా... ఇద్దరూ బాల్యమిత్రులు. ముంబయ్‌లోని అంధేరీ (ఈస్ట్‌)లో ఉండేవారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో తమ ఇరుగుపొరుగు వారంతా కిరాణా సరుకులు, కూరగాయల కోసం ఇబ్బంది పడటం గమనించారు. వారికి కావాల్సిన వస్తువుల్ని డోర్‌ డెలివరీ చేస్తే ఛార్జీలు కాస్త ఎక్కువైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి తమ బైకులపై 40 నుంచి 45 నిమిషాల్లో వారికి అందించారు.

కేవలం మూడేళ్ల కాలంలో ‘జెప్టో’ సంస్థ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. 1.5 బిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ వచ్చింది.


వినియోగదారులకు కావాల్సిన సరకులు వాళ్లు ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోనే అందించాలనే లక్ష్యంతో ‘జెప్టో’ను జూలై 2021లో ఏర్పాటు చేశారు పలిచా, వోహ్రా మిత్రద్వయం.

ఇప్పటిదాకా కిరాణాసరకులు, మాంసం, కూరగాయల్లాంటివి డెలివరీ చేస్తున్న ‘జెప్టో’ రానున్న కాలంలో యాపిల్‌ ‘ఐఫోన్‌ 16’ ను కూడా 10 నిమిషాల్లోనే అందించేందుకు సిద్ధమవుతోంది. జెప్టో కేఫ్‌ నుంచి వేడి వేడి స్నాక్స్‌ కూడా అందుబాటులోకి రానున్నాయి.

book6.3.jpg

లాక్‌డౌన్‌ అయిపోగానే సహజంగానే వారి డోర్‌ డెలివరీ వ్యాపారం దెబ్బ తింది. ప్రజలు ఎప్పటిలాగే సమీపంలోని దుకాణాల్లోకి వెళ్లి తమకు కావాల్సిన సరకుల్ని కొనడం మొదలెట్టారు. దాంతో మిత్రులిద్దరూ కంగుతిన్నారు. ‘‘వాళ్లు దుకాణానికి చేరుకునే లోపే, వారికి కావాల్సిన సరకుల్ని డోర్‌ డెలివరీ చేస్తేగానీ మనుగడ ఉండదని అర్థమైంది. అదే ‘జెప్టో’ ఆవిర్భావానికి తొలి అడుగు’’ అన్నారు పలిచా. ఆయనిప్పుడు ‘జెప్టో’కు సహ వ్యవస్థాపకుడు, సీఈవో.


దేశవ్యాప్తంగా 700 డార్క్‌ స్టోర్స్‌, 15 వేలకు పైగా స్టాక్‌ను నిల్వ ఉంచే గోదాములున్నాయి. 600 రూపాయల కనీస ఆర్డర్‌ ఉంటే... వాళ్లు ప్రామిస్‌ చేసినట్టుగా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు.

‘జెప్టోసెకండ్‌’ నుంచి స్ఫూర్తి పొంది తమ సంస్థకు ‘జెప్టో’ అని పేరు పెట్టారు. కాలానికి సంబంధించి ‘జెప్టో’ అనేది అత్యంత సూక్ష్మమైన యూనిట్‌. అంటే ఇది వేగానికి, సమర్ధతకు గుర్తుగా కనిపిస్తుంది. అత్యంత వేగంగా, నమ్మకమైన సేవలను అందిస్తామని చెబుతున్నట్టు.

లోకల్‌ రిటైలర్స్‌ నుంచి సరకుల్ని కొనడం మానేసి, మైక్రో వేర్‌హాస్‌లను ఏర్పాటు చేశారు. వాటిని ‘డార్క్‌ స్టోర్స్‌’గా పిలుస్తారు. అంటే ఒక ప్రాంతంలో అన్ని ఇళ్లకు కేవలం 10 నిమిషాల్లోనే చేరుకోవడానికి అనువుగా ఉన్న చోట ‘డార్క్‌ స్టోర్‌’ను పెట్టి, అక్కడ వినియోగదారులకు కావాల్సినవన్నీ స్టోర్‌ చేస్తారు. అక్కడి నుంచి జెప్టో బాయ్స్‌ ఆర్డర్‌ వచ్చిన 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు.

Updated Date - Mar 23 , 2025 | 11:04 AM