Suicide Attempt Video: మూడంతస్తుల భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. కాసేపటికి ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:39 PM
ఆస్పత్రి భవనం మూడో అంతస్తుపైన ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి కింద జనం గుమికూడారు. చేతిలో కర్ర పట్టుకుని నిలబడ్డ ఆ వ్యక్తి దూకడానికి ప్రయత్నించడం చూసి.. కింద నుంచి జనం వారించడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోని ఆ వ్యక్తి కాసేపటి తర్వాత..

ఆత్మహత్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైలర్ అవుతుంటాయి. కొందరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, కొండలపై నుంచి దూకేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మూడంస్థుల భవనం పైనుంచి కిందకు దూకేశాడు. అయితే కాసేపటికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆస్పత్రి భవనం వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి భవనం మూడో అంతస్తుపైన ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి కింద జనం గుమికూడారు. చేతిలో కర్ర పట్టుకుని నిలబడ్డ ఆ వ్యక్తి దూకడానికి ప్రయత్నించడం చూసి.. కింద నుంచి జనం వారించడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోని ఆ వ్యక్తి కాసేపటి తర్వాత చేతిలోని కర్రను కిందకు విసిరేసి, ఆ తర్వాత (Man jumped from third floor) తానూ కిందకు దూకేశాడు.
Viral: గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు అత్తమామల ఎంట్రీతో వెలుగులోకి అసలు విషయం..
చూస్తుండగానే కింద ఉన్న రేకుల షెడ్‌పై పడిపోయాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లను తాకడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. రేకులపై పడిపోయిన ఆ వ్యక్తి కాసేపు కదలకుండా అలాగే పడుకుండిపోయాడు. అక్కడి చేరుకున్న పోలీసులు.. అతన్ని కిందకు దించే ప్రయత్నం చేయగా, సడన్‌గా పైకి లేచాడు. చేతిలో ఇటుకలు పట్టుకుని కింద ఉన్న వారిని బెదిరించాడు. చివరకు ఎలాగోలా అతన్ని పట్టుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆ వ్యక్తి ఒడిశాకు చెందిన తేజరాజ్ యాదవ్‌గా తెలిసింది. కొడుకును తీసుకుని దుర్గ్‌లోని ఆస్పత్రికి వచ్చాడు.
ఈ క్రమంలో బిల్డింగ్ పైకి ఎక్కినట్లు తెలిసింది. అంతకు ముందు ప్రజలపై రాళ్లు విసిరి చాలా మందిని గాయపరిచాడని, పలు వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అంత పైనుంచి దూకినా ఏమీ కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లు, 7.74 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..