Camel Viral Video: వామ్మో.. ఒంటె ఇలా తింటుందేంటీ.. స్వీటు మధ్యలో ముళ్ల కాయను పెట్టగా.. చివరకు..
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:17 PM
ఓ వ్యక్తి ఒంటెను చూడగానే విచిత్ర ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఒంటె ఆహారం ఎలా తింటుందో పరిశీలించేందుకు అతను.. విచిత్ర ప్రయోగం చేశాడు. ఓ పుల్లకు రెండు స్వీట్లను గుచ్చాడు. అయితే వాటి మధ్యలో..

ఒంటెలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. ఎత్తుగా ఉండే ఒంటెలపై కూర్చుని సవారీ చేసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా తెగ ఆసక్తిచూపిస్తుంటారు. ఇక ఎడారుల్లో కనిపించే ఒంటెలు కొన్నిసార్లు అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఓ ఒంటె విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్వీట్ల మధ్యలో ముళ్ల కాయను పెట్టి.. ఒంటెకు అందించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఒంటెను చూడగానే విచిత్ర ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఒంటె ఆహారం ఎలా తింటుందో పరిశీలించేందుకు అతను.. విచిత్ర ప్రయోగం చేశాడు. ఓ పుల్లకు రెండు స్వీట్లను గుచ్చాడు. అయితే వాటి మధ్యలో ఓ ముళ్ల కాయను (Thorny fruit) కూడా పెట్టాడు. చివరకు దాన్ని ఒంటె ఎదురుగా వెళ్లి చూపించగా.. తినేందుకు దగ్గరికి వచ్చింది.
ముందుగా స్వీటు తిన్న ఒంటె.. ఆ తర్వాత ముళ్ల కాయను కూడా నోట్లోకి తీసుకుంది. దానికి ఉన్న ముళ్లు గుచ్చుకోగానే కింద పడేస్తుందని అంతా అనుకుంటారు. కానీ ఆ ఒంటె విచిత్రంగా ఆ ముళ్లను సైతం ఎంతో చాకచక్యంగా కొరికేస్తూ.. చివరకు (camel ate thorny fruit) ఆ కాయను సైతం తినేసింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత కొన్ని కాయలు, పండ్లను కూడా అందిస్తాడు. ఇలా ముళ్లతో కూడిన కాయను సులభంగా తినేసిన ఈ ఒంటెను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఎడారుల్లో జీవించే ఒంటెలు.. అక్కడ కనిపించే ముళ్లతో కూడిన కాక్టస్, ఇతర ముళ్ల మొక్కలు, కాయలను సులభంగా తినగలవు.
Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..
ఒంటె లాలాజలంలో ముళ్లను మృదువుగా చేసే మూలకాలను ఉంటాయని, ఇవి ముళ్ల కాయలను సులభంగా మింగడానికి సహాయపడతాయట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఒంటె మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ముళ్ల కాయలను సైతం ఎంతో సులభంగా తినేసిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..