Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:24 PM
అడవి నుంచి సమీప జనావాస ప్రాంతానికి చేరుకున్న ఓ ఏనుగు.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఏనుగు ఆవేశంగా రావడం చూసి స్థానికులంతా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో చాలా మంది అక్కడే ఉన్న రెండస్థుల నిర్మాణంపైకి ఎక్కేశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

ఏనుగుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రశాంతంగా కనిపించే ఏనుగులు.. కొన్నిసార్లు పెద్ద ప్రళయాన్నే సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా పెద్ద వృక్షాలు, ఇళ్లను పెకలించేస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు మనుషులను వెంబడించి మరీ దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు దూసుకురావడం చూసి పరుగులు తీసిన జనం.. చివరకు రెండస్థుల నిర్మాణం పైకి ఎక్కేశారు. చివరకు ఏ జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) డూయర్స్ ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవి నుంచి సమీప జనావాస ప్రాంతానికి చేరుకున్న ఓ ఏనుగు.. (elephant that chased people) అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఏనుగు ఆవేశంగా రావడం చూసి స్థానికులంతా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో చాలా మంది అక్కడే ఉన్న రెండస్థుల నిర్మాణంపైకి ఎక్కేశారు.
Elephant Viral Video: ఏనుగు లవ్ ప్రపోజ్ ఎప్పుడైనా చూశారా.. పూలు పట్టుకుని ఏం చేసిందో చూడండి..
అయినా ఏనుగు వారిని వదలకుండా వెంబడించింది. రెండస్థుల నిర్మాణం వద్దకు వెళ్లి.. తన తొండంతో దాన్ని అటూ, ఇటూ ఊపడం స్టార్ట్ చేసింది. దీంతో అంత పెద్ద నిర్మాణం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. దీంతో పైన ఉన్న కొందరు యువకులు.. భయంతో కిందకు దూకేసి, దూరంగా పారిపోయారు. మరికొందరు బిక్కుబిక్కుమంటూ అలాగే ఉండపోయారు. అయితే దాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఏనుగు.. సడన్‌గా మనసు మార్చుకుని అక్కడి నుంచి మరో వైపు వెళ్లిపోయింది. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఏనుగును చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ అడవులను నరికేయడం వల్లే ఇలా జరుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.34 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..