Share News

Prakash Raj: బెట్టింగ్‌ యాప్‌లు.. స్పందించిన ప్రకాష్ రాజ్

ABN , Publish Date - Mar 20 , 2025 | 07:52 PM

Prakash Raj: బెట్టింగ్‌ యాప్‌ల సంచలనం సృష్టించడంతో.. అందులో నటించిన వారికి పోలీసుల నుంచి పిలుపు వస్తుంది. అందులో భాగంగా పలువురు ఇప్పటికే పోలీస్ స్ఠేషన్ మెట్లు ఎక్కారు. ఆ క్రమంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఓ గ్రామంలో షూటింగ్ చేసుకుంటున్న ఆయనకు ఈ వ్యవహారం తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు.

Prakash Raj: బెట్టింగ్‌ యాప్‌లు.. స్పందించిన ప్రకాష్ రాజ్
Prakash Raj

హైదరాబాాద్, మార్చి 20: బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన గురువారం వీడియో విడుదల చేశారు. తాను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. 2016లో ఆ యాడ్ సంస్థ తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే తాను ఈ యాడ్ చేసిన మాట వాస్తమని ఆయన ఒప్పుకున్నారు. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తాను తెలుసుకున్నానన్నారు. 2017లో ఆ ఒప్పందాన్ని పొడిగిస్తామని ఆ యాడ్ సంస్థ వారు తనను కోరారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కానీ ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని వారిని తాను కోరినట్లు తెలిపారు. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశానని ప్రకాష్ రాజ్ వివరించారు.


తాను ప్రస్తుతం ఏ గేమింగ్ యాప్‌లకు ప్రచారకర్తగా పని చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక 2021లో ఆ సంస్థను మరో సంస్థకు విక్రయిస్తే.. సోషల్ మీడియాలో వాళ్లు తన ప్రకటన వాడారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రకటన వాడినందుకు ఆ సంస్థకు లీగల్ నోటీసులు పంపానని చెప్పారు. అయితే ఈ బెట్టింగ్‌ల యాప్‌ల కారణంగా.. అందులో నటించిన సెలబ్రెటిలను పోలీసులు పిలుస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయన్నారు. కానీ తనను ఇంత వరకు పోలీసులు పిలవ లేదని చెప్పారు. ఓ వేళ పోలీసులు పిలిస్తే.. వెళ్లి.. వారికి తాను వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో భాగంగా ఓ గ్రామంలో ఉన్నానని ప్రకాష్ రాజ్ వివరించారు.

Updated Date - Mar 20 , 2025 | 07:52 PM