Share News

Lovers Romance on Roads: బెంగళూరు రోడ్లపై రెచ్చిపోయిన ప్రేమజంట.. వారి చేష్టలకు.. బాబోయ్..

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:18 PM

ర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. కళాశాల ఎగ్గొట్టి సర్జాపుర మెయిన్ రోడ్డుపై ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. యువకుడు ద్విచక్రవాహనం నడుపుతుండగా యువతి ముందువైపు నుంచి అతన్ని కౌగిలించుకుని కూర్చుంది.

Lovers Romance on Roads: బెంగళూరు రోడ్లపై రెచ్చిపోయిన ప్రేమజంట.. వారి చేష్టలకు.. బాబోయ్..
Lovers Romance on Bike

బెంగళూరు: కొంతమంది యువతీ, యువకులు బరితెగిస్తున్నారు. ప్రేమ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నలుగురూ ఉన్నారనే ఆలోచన లేకుండా ఎక్కడ పడితే అక్కడ కక్కుర్తిపడుతున్నారు. సినిమాలు చూస్తూ హీరోహీరోయిన్ల మాదిరిగా తాము చేయాలని భావిస్తున్నారు. నిస్సిగ్గుగా రోడ్లపైనే రొమాన్స్ చేస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. కళాశాల ఎగ్గొట్టి సర్జాపుర మెయిన్ రోడ్డుపై ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. యువకుడు ద్విచక్రవాహనం నడుపుతుండగా యువతి ముందువైపు నుంచి అతన్ని కౌగిలించుకుని కూర్చుంది. తన ముఖం కనిపించకుండా గట్టిగా కౌలిగించుకుని రొమాన్స్ చేసింది. అలా వెళ్తున్న సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పైనుంచి జారినప్పటికీ మళ్లీ తిరిగి తన పొజీషన్‌లోకి వచ్చింది. చుట్టూ పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లు ఉన్నా వారికి మాత్రం అవేమీ పట్టవన్నట్లు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలు గుప్పిస్తోంది. కాగా, వారి చేష్టలను ఓ వాహనదారుడు తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా అయ్యింది.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై ఇవేం పనులంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది అయితే తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు భావిస్తుంటే రోడ్లపై బరితెగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించాలని కోరుతున్నారు. ఈ వీడియోపై పోలీసులు స్పందించి మరోసారి రోడ్లపై ఎవ్వరూ అలా ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Home Loans: హోమ్ లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడే..

Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..

Updated Date - Feb 27 , 2025 | 02:01 PM