Share News

CIBIL Score: సిబిల్ స్కోరు తక్కువగా ఉన్న వరుడికి షాక్! చివరి నిమిషంలో పెళ్లి రద్దు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 08:33 PM

సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నందుకు ఓ యువకుడి పెళ్లి చివరి నిమిషంలో రద్దైన ఘటన మహారాష్ట్రలో తాజాగా వెలుగు చూసింది.

CIBIL Score: సిబిల్ స్కోరు తక్కువగా ఉన్న వరుడికి షాక్! చివరి నిమిషంలో పెళ్లి రద్దు!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే అప్పు పుట్టదు. ఇలాంటి వారితో రిస్క్ అని భావించే సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావు. సిబిల్ స్కోరు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతుంటారు. అయితే, సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే పెళ్లిళ్లు కూడా కావని తాజా ఘటన రుజువు చేసింది. మహారాష్ట్రంలో ఓ యువకుడి పెళ్లి సిబిల్ స్కోరు కారణంగా చివరి నిమిషంలో రద్దైన వైనం ప్రస్తుతం సంచలనంగా మారింది Viral.

Washing Clothes in Space: అంతరిక్షంలో వ్యోమగాములు దుస్తులు ఉతుక్కుంటారా?


పెళ్లంటే జాతయాలు, వధూవరుల ఉద్యోగాలు, జీతనాతాలు ఆస్తిపాస్తులు చూస్తారు. అయితే, తాజా ఘటనలో ఈ జాబితాలో సిబిల్ స్కోరు కూడా వచ్చి చేరింది. ముర్తిజాపూర్ నగరంలో రెండు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు నడుస్తున్నాయి. వధూవరులు ఇద్దరూ ఒకరికొరు నచ్చారు. ఇద్దరి నేపథ్యాలు రెండు కుటుంబాలకూ నచ్చాయి. ఇక పెళ్లి దాదాపుగా ఖరారైపోయినట్టే అని అంతా అనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో వధువు మేనమామ కొత్త షరతు ముందు పెట్టాడు. వరుడికి సిబిల్ స్కోరు చూశాక పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొందామని అన్నాడు.

Viral News: ఆఫీసులో సెలవు ఇవ్వలేదని తోటి ఉద్యోగులను ఏం చేశాడంటే..


కానీ వరుడి సిబిల్ స్కోరు చాలా తక్కువగా ఉందని తెలిశాక వధువు కుటుంబం అతడి సంబంధాన్ని క్యాన్సిల్ చేసింది. అప్పటికే వరుడు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు సిబిల్ స్కోరు ద్వారా అర్థం కావడంతో ఆ సంబంధానికి వధువు తరపు వారు నో చెప్పేశారు. ‘‘అసలే అప్పుల్లో ఉన్న అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి’’ అని వధువు మేనమామ ప్రశ్నించాడు. ఇతర కుటుంబసభ్యులందరూ ఇదే మాటపై నిలబడటంతో చివరకు వరుడి కుటుంబం నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.

రుణగ్రహీతల విశ్వసనీయతకు సిబిల్ స్కోరు కొలమానంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది మూడు అంకెలున్న సంఖ్య. మూడు వందల నుంచి 900 వందల వరకూ ఉండే సిబిల్ స్కోరును బట్టి లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలా వద్దా అన్నది సంస్థలు నిర్ణయిస్తాయి. సాధారణంగా ఈ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే రుణాలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

Read Latest and Viral News

Updated Date - Feb 08 , 2025 | 08:33 PM

News Hub