Share News

Viral Video: ఇదేం రివేంజ్‌రా బాబోయ్.. యువతి చెంపదెబ్బ కొట్టిందని.. చివరకు ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Feb 04 , 2025 | 07:22 PM

ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ యువడిపై యువతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. హెల్మెట్ పెట్టుకుని ఉన్న అతడితో వాగ్వాదానికి దిగుతుంది. ఈ క్రమంలో మరింత కోపంతో ఒక్కసారిగా అతడి మొఖంపై గట్టిగా కొడుతుంది. దీంతో చివరకు అతను యువతిపై ప్రతీకారం తీర్చుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: ఇదేం రివేంజ్‌రా బాబోయ్.. యువతి చెంపదెబ్బ కొట్టిందని.. చివరకు ఏం చేశాడో చూడండి..

కొందరు యువతులను వివిధ రకాలుగా వేధిస్తుంటారు. ప్రేమించాలని వెంటపడడడం, ఒప్పుకోకపోతే వేధించడం చేస్తుంటారు. అయినా కొందరు యువతులు ఎదురుతిరగలేక మౌనంగా ఉండిపోతుంటారు. మరికొందరు ధైర్యంగా ప్రశ్నించడం, ఇంకొందరు చెంప చెల్లుమనిపిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు వారిపై రివేంజ్ తీర్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తిని యువతి చెందెబ్బ కొడుతుంది. దీంతో చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ యువడిపై యువతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. హెల్మెట్ పెట్టుకుని ఉన్న అతడితో వాగ్వాదానికి దిగుతుంది. ఈ క్రమంలో మరింత కోపంతో ఒక్కసారిగా (young woman slapped man) అతడి మొఖంపై గట్టిగా కొడుతుంది. యువతి అలా సడన్‌గా కొట్టడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వెంటనే ప్రతీకారంతో రగిలిపోతాడు.

Viral Video: తెలివంటే ఇదే.. సిమెంట్ పని చేస్తున్నా.. వీళ్ల తెలివితేటలు అమోఘం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఎలాగైనా పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో.. చివరకు తన బైకును స్టార్ట్ చేసి, వెనుక టైరును గిరగిరా తిప్పుతూ సదరు యువతిపై దుమ్ము పడేలా చేస్తాడు. బైకు టైరు వేగంగా తిరగడంతో దుమ్ము మొత్తం ఆమెపై పడిపోతుంది. దీంతో ఆమె అటూ, ఇటూ జరుగుతూ తప్పించుకోవాలని చూస్తుంది. అయినా ఆ వ్యక్తి ఆమెను వదలకుండా చాలా సేపు అలా దుమ్ము మీద పడేలా చేస్తాడు. ఈ ఘటనతో అక్కడున్న మిగతా స్నేహితులు షాక్ అవుతారు.

Camel Viral Video: వామ్మో.. ఒంటె ఇలా తింటుందేంటీ.. స్వీటు మధ్యలో ముళ్ల కాయను పెట్టగా.. చివరకు..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది మరీ దారుణం.. ఇలా చేయడం సరికాదు’’.. అంటూ కొందరు, ‘‘ఇదేం రివేంజ్‌రా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 04 , 2025 | 07:22 PM