Chennai: పిడుగుల నిరోధానికి ఆధునిక పరికరం..
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:52 PM
తిరుచెందూర్ ఆలయ ప్రాంతంలో పిడుగుల నిరోధానికి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో పరికరం ఏర్పాటుచేశారు. తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయానికి(Thiruchendur Subramanya Swamy Temple) వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

చెన్నై: తిరుచెందూర్ ఆలయ ప్రాంతంలో పిడుగుల నిరోధానికి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో పరికరం ఏర్పాటుచేశారు. తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయానికి(Thiruchendur Subramanya Swamy Temple) వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల సౌకర్యార్ధాం ఆలయం, ప్రాంగణంలో రూ.300 కోట్లతో వసతుల కల్పన జరుగుతోంది. జూలైలో ఆలయ కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయ రాజగోపురంలో ఉన్న కలశాలు, ఆలయ లోపలి, బయట ప్రాకారాలు, భక్తుల విడిది గృహాలకు మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Trains: తెలుగు రాష్ట్రాల్లో.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లు
ఈ నేపథ్యంలో, రాజగోపురంలోని కలశాలు రక్షించేలా ఇప్పటికే ఏర్పాటుచేసిన పిడుగుపాటు నిరోధక పరికరం తొలగించి, కొత్తగా రెండు పరికరాలు ఏర్పాటుచేశారు. గతంలో ఏర్పాటుచేసిన పరికరం ఇనుముతో తయారు చేయగా, కొత్తగా ఏర్పాటుచేసిన పరికరం రాగితో తయారుచేయించారు. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీవర్షాలతో తంజావూరు(Tanjavuru) బృహదీశ్వరాలయ రాజగోపురంపై పిడుగు పడి కలశం దెబ్బతిన్న ఘటన నెలకొంది.
ఈ ఘటనపై అప్రమత్తమైన హిందూ దేవాదాయ శాఖ, రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల్లోని రాజగోపురాలపై అధునాతన పిడుగు నిరోధక పరికరాలు ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయమై దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. 137 అడుగుల ఎత్తున్న రాజగోపురంలో కలశాలు ఏర్పాటుచేశామని, ఈ ప్రాంతంలో రెండువైపులా ఈ పరికరాలు అమర్చామన్నారు. 11 అడుగుల ఎత్తున్న ఈ పరికరం అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని అధికారులు తెలిపారు.
వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News