కాలం చెక్కిన లోయ
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:53 PM
చైనాలోని యులిన్ నగర సమీపంలో ఉంది. ఇసుక తిన్నెల మీద చేరిన ఎర్రని ఇసుక రేణువులు, భూజలంలోని ఖనిజాలు, విపరీత గాలుల వల్ల అనేక మార్పులు చెంది ఇసుకరాళ్లు ఏర్పడ్డాయి.

ఒకప్పుడు ఇవన్నీ సాధారణ ఇసుక తిన్నెలే. కొన్ని వేల ఏళ్లుగా నీళ్లు, బలమైన గాలులు చేసిన మాయాజాలం వల్ల ఇలా రాతి అలల లోకంగా మారిపోయింది. కాలం చెక్కిన ఈ భౌగోళిక వింత పేరు ‘జింగ్‌బియన్ వేవ్ వ్యాలీ’. చైనాలోని యులిన్ నగర సమీపంలో ఉంది. ఇసుక తిన్నెల మీద చేరిన ఎర్రని ఇసుక రేణువులు, భూజలంలోని ఖనిజాలు, విపరీత గాలుల వల్ల అనేక మార్పులు చెంది ఇసుకరాళ్లు ఏర్పడ్డాయి.
అయితే భౌగోళిక మార్పునకు గుర్తుగా అలల ముద్రలు రాళ్ల మీద అలాగే నిలిచిపోయాయి. అందుకే ‘వేవ్ వ్యాలీ’ అంటారు. ఒక్కో కాలంలో ఒక్కో రంగుతో జింగ్‌బియన్ అలల లోయ అద్భుతంగా మార్పు చెందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం ఎర్రగా మారి టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాతికొండల మధ్యలో నడుస్తూ... పర్యాటకులు సరికొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా అనుభూతి చెందుతారు.