Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
ABN , Publish Date - Feb 10 , 2025 | 09:24 AM
రద్దీ రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోవడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. సాధారణ సమయాల్లో ఇలాంటి ట్రాఫిక్ జామ్‌లను ఎలాగోలా భరించవచ్చు. పెళ్లి రోజున కూడా అదే పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటి దృశ్యమే కనిపించింది.

మీరు మన దేశంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ఏ మహా నగరంలో నివసిస్తున్నా మిమ్మల్ని చికాకు పరిచే విషయాల్లో ఒకటి చాలా కామన్‌గా ఉంటుంది. అది ట్రాఫిక్ జామ్ (Traffic Jam). రద్దీ రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోవడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. సాధారణ సమయాల్లో ఇలాంటి ట్రాఫిక్ జామ్‌లను ఎలాగోలా భరించవచ్చు. పెళ్లి రోజున (Wedding Day) కూడా అదే పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. దీనిని చూసిన కొంతమంది వినియోగదారులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. (Viral Groom video)
shourrya23 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు పెళ్లి దుస్తులు వేసుకుని కల్యాణ మండపానికి వెళుతున్నాడు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన వాహనాల మధ్య నుంచి నడుస్తూ తన పెళ్లి ఊరేగింపును వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఆ వరుడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ``30 ఏళ్ల వయసులో ఉన్న నీకు పెళ్లి చేసుకోవడానికి ఇదే మొదటి, చివరి అవకాశం. కానీ ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంది. బహుశా విశ్వం నీకు ఒక సిగ్నల్ ఇస్తోంది. సోదరా, సింగిల్‌గానే ఉండు, నువ్వు సురక్షితంగా ఉంటావు`` అంటూ సరదాగా కామెంట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``పెళ్లికి ముందు సహనానికి నిజమైన పరీక్ష``, అక్షరాలా తన జీవితంలోని తదుపరి దశలోకి అడుగుపెట్టాడు
`, ``అతను మండపానికి చేరుకుంటే, అతను వధువుకు అర్హుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో కనిపెట్టండి..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి