Woman fall from Terrace: కొత్తగా ఏదైనా చేద్దామనుకుని దెబ్బైపోయిన మహిళ.. ఇంటిపై నుంచి దూకితే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 02:33 PM
సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నంలో ఓ మహిళ భారీ షాక్ తగిలింది. ఇంటిపై నుంచి దూకేటప్పుడు చీర టాపుకు చిక్కుకోవడంతో ఆమె బోర్లా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: షార్ట్ వీడియోలతో పాప్యులర్ అయిపోవాలన్న యావ నేటి యువతరానికి ఎక్కువైపోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఇది ఆదాయ వనరుగా కూడా మారింది. అయితే, కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోవడంతో పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. నెటిజన్లను ఆకర్షించేందుకు, ఫాలోవర్లను పెంచుకునేందుకు కంటెంట్ క్రియేటర్లు నానా అవస్థలూ పడాల్సి వస్తోంది. కొత్తగా ఏం చేయాలో తెలీక తికమక పడి చివరకు ఇబ్బందుల పాలవుతున్న వారు కోకొల్లలు. వైరల్ అయ్యే ప్రయత్నంలో ముందూ వెనకా ఆలోచించకుండా దూసుకెళ్లి చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట జనాలను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. వీడియోలో మహిళ పాట్లు చూసి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ షార్ట్ వీడియో కోసం ప్రయత్నించింది. అయితే, ఫాలోవర్లు పెంచుకోవాలన్న తాపత్రయంలో వెరైటీకి ప్రయత్నించింది. తన వయసును కూడా మర్చిపోయి ఏకంగా ఇంటి మీద ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వాస్తవానికి అది రేకుల ఇల్లు. దాని మీద ఎక్కితే రేకులు పగిలి కిందపడతారు. ఇలా అందరికీ తెలిసిన విషయమే.
కానీ వ్యూస్ యావలో పడ్డ మహిళ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఎలాగైనా జనాల్ని ఆకర్షించాలన్న తాపత్రయంలో కొంప ఎక్కి, చీర కట్టులో డ్యాన్స్ చేసింది. రెండు క్షణాల తరువాత ఆమె కిందకు దూకగా ఒంటికి ఉన్న చీర రేకుకు తట్టుకుంది. దీంతో, మహిళ బొక్కర్లా పడింది. ముఖానికి పెద్ద దెబ్బే తగిలింది.
Also Read: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే
ఇక వీడియో జనాలకు అమితంగా ఎంటర్‌టైన్ చేయడంతో భారీగా వ్యూస్ వచ్చిపడ్డాయి. ఇక కామెంట్స్‌కు అయితే అంతేలేకుండా పోయింది. కొందరు ఆమెు పరిస్థితి చూసి పడీ పడీ నవ్వుకుంటే మరికొందరు మాత్రం తెగ తిట్టిపోశారు. వయసు మర్చిపోతేలా ఎలా.. చిన్న పిల్లలా చేస్తే పెద్ద దెబ్బలు తగులుతాయి అంటూ కామెంట్ చేశారు. కొందరు మాత్రం కంటెంట్ క్రియేటర్లపై జాలి చూపించారు. వైరల్ అయిపోవాలన్న తాపత్రయంలో అనేక మంది ఇలాంటి ఊహించని చిక్కుల్లో పడుతున్నారంటూ కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. మరి మీరూ ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేయండి.