Ticket Reservation Tips: రైల్వే టికెట్ వెయిటింగ్ లిస్టులో చూపిస్తోందా.. ఈ టిప్స్ ట్రై చేయండి..
ABN , Publish Date - Mar 23 , 2025 | 02:33 PM
రైలు ప్రయాణాల్లో సీటు దొరకాలంటే నెలల ముందుగానే రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు దొరకడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా. అయితే బుక్ చేసేటప్పుడు తక్కువ రద్దీగా ఉన్న రైళ్లను ఎంచుకోవడం మంచిది.

హైదరాబాద్: భారతదేశంలో రైలు ప్రయాణానికే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. పేద, మధ్య తరగతి, ధనికులు ఇలా అందరూ ప్రయాణించేలా కోచ్‌లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ప్రజలు ఓటు వేస్తుంటారు.
ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అధిక బస్సు ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు దీన్నే ఆశ్రయిస్తుంటారు. అయితే ఎక్కువ మంది రైలు ప్రయాణానికి మెుగ్గు చూపడంతో వెయిటింగ్ లిస్ట్ అనేది చాంతాడు కంటే పెద్దదిగా మారిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి ట్రై చేయండి..
రైలు ప్రయాణాల్లో సీటు దొరకాలంటే నెలల ముందుగానే రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు దొరకడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా. అయితే బుక్ చేసేటప్పుడు తక్కువ రద్దీగా ఉన్న రైళ్లను ఎంచుకోవడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు నడిచే రైళ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇలాంటి ట్రైన్లలో సీట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అత్యవసర కోటా కింద కేటాయించే సీట్లను రద్దీ తక్కువగా ఉన్న రైళ్లలో పొందే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రారంభ స్టేషన్ నుంచి కాకుండా ఒకటి లేదా రెండు స్టేషన్ల తర్వాత నుంచి టికెట్ బుక్ చేయడం మంచిది. ఎందుకంటే మెుదటి స్టేషన్‌లోనే బుక్ చేసుకుంటే టికెట్ దొరకడం కష్టం. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రెండు, మూడు స్టేషన్ల తర్వాత నుంచి రిజర్వేషన్ చేయడం మంచిది. అలా చేస్తే ఆయా స్టేషన్లలో ప్రయాణికులు దిగిపోయి సీటు దొరికే అవకాశం ఉంటుంది.
మరోవైపు అత్యవసర సమయాల్లో ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ టికెట్లపై ఆధారపడొచ్చు. సాధారణంగా తత్కాల్ టికెట్లు ఖరీదైనవి. అయితే అసాధారణ సందర్భాల్లో తత్కాల్ టికెట్లు మిగిలిపోతే వాటిని జనరల్ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఆటోమేటిక్ గా కేటాయిస్తారు. దీని కోసం పీఎన్ఆర్ స్టేటస్‌ను నిరంతరం పరిశీలించడం వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మ్ అయ్యే అవకాశాలను పెంచుతంది.
ఈ వార్తలు కూడా చదవండి:

రైలు రద్దు .. రిజర్వేషన్ టికెట్ రిఫండ్ పొందండం ఎలాగంటే..

ఈ ఫొటోలో 78 ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా..?

ప్రాణాలు తీస్తున్న ప్రేమికులు.. కాళ్లపారాని ఆరకముందే ..

బైకు హ్యాండిల్‌కు వేలాడుతున్న బ్యాగు.. దగ్గరికి వెళ్లి చూడగా..
