Share News

Child Recites State Capitals: బాబోయ్.. ఈ బుడ్డోడిని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారా?

ABN , Publish Date - Mar 23 , 2025 | 02:32 PM

నాలుగైదేళ్లు కూడా లేని బాలుడు రాష్ట్రాల రాజధానుల పేర్లను అడిగిన వెంటనే తడుముకోకుండా చెబుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు.

Child Recites State Capitals: బాబోయ్.. ఈ బుడ్డోడిని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారా?
Child Recites State Capitals Flawlessly

ఇంటర్నెట్ డెస్క్: నాలుగైదేళ్ల వయసున్న చిన్నారులు అంటే ముద్దుముద్దు మాటలు.. కల్మషం లేని నవ్వులే గుర్తుస్తాయి. కానీ ఆధునిక జమానాలు బాల్యం తీరుతెన్నులు కూడా మారిపోతున్నాయి. ఏఐ జమానాలో పెరుగుతున్న చిన్నారులు అదే స్థాయిలో తెలివితేటలు కనబరుస్తున్నారు. ఒకప్పటి తరంతో పోలిస్తే వెయ్యి రెట్ల వేగంతో దూసుకెళుతున్నారు. మాటలు కూడా రాని వయసులో ప్రపంచపు విశేషాల గురించి అలవోకగా చెప్పేస్తున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలోని చిన్నారి ప్రతిభ చూసి జనాలు షాకైపోతున్నారు.


Also Read: ర్యాపిడో డ్రైవర్‌‌ను చూడగానే ఫుల్ ఖుష్.. ఊబెర్ క్యాబ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. ఎందుకంటే..

ఈ వీడియోలోని చిన్నారి వయసు 4 - 5 ఏళ్లకు మించి ఉండవు. మాటలు కూడా పూర్తిగా రాని వయసు. కానీ వివిధ రాష్ట్రాల రాజధానుల పేర్లు అడగంగానే తడుముకోకుండా చెప్పేశాడు. బాలుడిని ఎత్తుకున్న తండ్రి వివిధ రాష్ట్రాల రాజధానులు ఏమిటని అడగగానే ముద్దుముద్దు మాటల్లో చెప్పేశాడు. అసలేమాత్రం తడుముకోకుండా చాలా సహజంగా చెప్పుకుపోయాడు.

Read Also: అణు రియాక్టర్ నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. గిన్నిస్ రికార్డు సొంతం


ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. పిల్లాడి తెలివితేటలకు ముచ్చట పడుతున్నారు. అంత చిన్న వయసులో వివిధ రాష్ట్రాల రాజధానుల పేర్లను గుర్తుపెట్టుకోవడం అడిగిన వెంటనే చెప్పడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ఈ పిల్లాడు చిచ్చర పిడుగని కొందరు కామెంట్ చేశారు. గూగుల్‌లా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతున్న బాలుడిని కచ్చితంగా ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలని మరికొందరు కామెంట్ చేశారు. ఈ తరం పిల్లల్లో చాలా మంది ఇదే స్పీడుతో ఉంటున్నారని, సరిగా నడక రాని ఏజ్ నుంచే గ్యాడ్జెట్స్‌కు అలవాటు పడి తెలివితేటల్లో దూసుకుపోతున్నారని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Mar 23 , 2025 | 02:32 PM