ఐవోసీ బాస్‌గా కోవెంట్రీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:23 AM
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవో సీ) అధ్యక్షపదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఒలింపిక్ మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ (జింబాబ్వే) చరిత్ర సృష్టించింది...

తొలి మహిళగా చరిత్ర
కోస్టా నవరినో (గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవో సీ) అధ్యక్షపదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఒలింపిక్ మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ (జింబాబ్వే) చరిత్ర సృష్టించింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన ఐవోసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఆఫ్రికా జాతీయురాలిగా కూడా కోవెంట్రీ రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఎన్నికల్లో వరల్డ్ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో, మాజీ అధ్యక్షుడి కుమారుడు జువాన్ ఆంటోనియో సమరాంచ్ జూనియర్ సహా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వీరిద్దరినీ ఓడించిన కోవెంట్రీ జెయింట్ కిల్లర్‌గా నిలిచింది. ఐవోసీ సభ్యత్వం కలిగిన 97 మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. తొలి రౌండ్‌లోనే గెలుపునకు కావాల్సిన 49 ఓట్లు కోవెంట్రీకి లభించాయి. సమరాంచ్‌కు 28, సెబాస్టియన్‌కు 8 ఓట్లు పోలయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి