Share News

అంగరంగ వైభవంగా..

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:05 AM

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌, క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ స్టెప్పులు, హుషారెత్తించిన శ్రేయా ఘోషల్‌ పాటలు..మైమరపించిన దిశా పటాని డ్యాన్స్‌.. వెరసి ఐపీఎల్‌ ప్రారంభోత్సవం ఉర్రూతలూగించింది...

అంగరంగ వైభవంగా..

కోల్‌కతా: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌, క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ స్టెప్పులు, హుషారెత్తించిన శ్రేయా ఘోషల్‌ పాటలు..మైమరపించిన దిశా పటాని డ్యాన్స్‌.. వెరసి ఐపీఎల్‌ ప్రారంభోత్సవం ఉర్రూతలూగించింది. షారుక్‌ ఖాన్‌ ప్రసంగంతో కార్యక్రమం మొదలుకాగా..మా తుఝే సలామ్‌ అన్న పాటను ఘోషల్‌ ఆలపించగానే ‘వందేమాతరం’ అంటూ స్టేడియం యావత్తు ఊగిపోయింది. ఇక..విరాట్‌ కోహ్లీని వేదికపైకి ఆహ్వానించిన షారుక్‌ అతడితో కలిసి పఠాన్‌ సినిమాలోని ‘మేరీజాన్‌’ పాటకు నృత్యం చేశాడు. ‘లుట్‌ ఫుట్‌ గయా’ అన్న పాటకు రింకూసింగ్‌తో కలిసి షారుక్‌ కాలు కదిపాడు. ర్యాప్‌ సింగర్‌ కరణ్‌ ఔజా తన గాత్రంతో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపాడు. అదిరే డ్రెస్‌తో.. కళ్లు చెదిరే డ్యాన్స్‌తో దిశా పటాని ఫ్యాన్స్‌ను మరో లోకంలోకి తీసుకెళ్లింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ సహా ఇతర అతిథులను షారుక్‌ వేదికపైకి ఆహ్వానించాడు. 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ఐపీఎల్‌ ఆడుతున్న విరాట్‌కు మెమెంటోను బిన్నీ ప్రదానం చేశాడు.


44-Spr.jpg

కోల్‌కతాలో జరిగిఏ ఐపీఎల్‌ ఆరంభ వేడుకల్లో బీసీసీఐ కార్యదర్శి సైకియా, కోశాధికారి భాటియాతో పాలకమండలి సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 04:07 AM