Share News

Nitish Kumar Reddy: నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్

ABN , Publish Date - Jan 26 , 2025 | 06:10 PM

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ యంగ్ ప్లేయర్లను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అతడి హయంలోనే తెలుగు ఆటగాళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిని గౌతీ బాగా ప్రోత్సహిస్తున్నాడు.

Nitish Kumar Reddy: నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్
Nitish Kumar Reddy

భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రతి ఆటగాడి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏ ప్లేయర్ బలం ఏంటి? బలహీనత ఏంటి? అనేది తెలుసుకొని వాళ్లను మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రతిభ కలిగిన యంగ్ క్రికెటర్స్‌ను ప్రోత్సహిస్తూ టీమిండియాకు యువ రక్తం ఎక్కిస్తున్నాడు. అందుకే వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ భారత జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ప్లేయర్ల మేనేజ్‌మెంట్‌లో అతడు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి.


తప్పు ఎవరిది?

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ నుంచి తెలుగు తేజం నితీష్ రెడ్డి తప్పుకున్నాడు. చెపాక్ టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఇంజ్యురీ కావడంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో పించ్ హిట్టర్ శివమ్ దూబెను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు ఫుల్ ఫిట్‌గా ఉన్న నితీష్ ఇలా హఠాత్తుగా సిరీస్ మొత్తానికి దూరమవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తూ చురుగ్గా కనిపించినోడు చిన్నపాటి గాయానికే పూర్తి సిరీస్‌కు దూరవమవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది టీమిండియా మేనేజ్‌మెంట్ తప్పు అని.. నితీష్‌తో గంభీర్ ఆడుకుంటున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.


డేంజర్!

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నితీష్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. దాదాపు నెల రోజుల పాటు ఆడి అలసిపోయాడు. కానీ ఆ తర్వాత ఎక్కువ విరామం లేకుండానే వచ్చి ఇంగ్లండ్ సిరీస్ ఆడాడు. వయసులో చిన్నోడు కావడంతో వర్క్‌లోడ్‌ అతడ్ని ఇబ్బంది పెట్టిందని.. అందుకే సిరీస్‌కు దూరమయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గంభీర్‌ యంగ్‌స్టర్స్‌కు చాన్సులు ఇవ్వడం మంచిదే గానీ వాళ్ల వర్క్‌లోడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇలాంటివి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి గాయం ఇంకోసారైతే నితీష్ కెరీర్‌కు డేంజర్ అని కామెంట్స్ చేస్తున్నారు.


బీ కేర్‌ఫుల్!

నితీష్ లాంటి యువ ఆటగాళ్ల విషయంలో గౌతీ మరింత ఫోకస్డ్‌గా ఉండాలని.. వాళ్ల వయసు, డొమెస్టిక్ బ్యాగ్రౌండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్ని మ్యాచులు ఆడించాలి? ఎంత రెస్ట్ ఇవ్వాలనేది? డిసైడ్ అవ్వాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ప్లేయర్ల మేనేజ్‌మెంట్ పక్కాగా ఉంటే టీమిండియాకు ఎదురుండదని, గాయాల బెడద లేకపోతే జట్టు మరింత బాగా పెర్ఫార్మ్ చేస్తుందని.. గౌతీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సజెషన్ ఇస్తున్నారు.


ఇదీ చదవండి:

ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు

మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్.. వర్తు వర్మ వర్తు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 06:12 PM

News Hub