ఢిల్లీ దశ తిరిగేనా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:27 AM
మెగా లీగ్‌లో తొలి టైటిల్ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 18వ సీజన్‌లో సరికొత్త లుక్‌తో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఈసారైనా కలల కప్‌ను ముద్దాడాలనుకొంటోంది...

రాహుల్, అక్షర్‌పై ఆశలు
మెగా లీగ్‌లో తొలి టైటిల్ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 18వ సీజన్‌లో సరికొత్త లుక్‌తో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఈసారైనా కలల కప్‌ను ముద్దాడాలనుకొంటోంది. ఆ జట్టు 2020లో ఫైనల్ చేరుకున్నా..ముంబై చేతిలో ఓడి రన్నర్‌పగా సరిపెట్టుకొంది. రిషభ్ పంత్‌ను వదులుకోవాలన్న షాకింగ్ నిర్ణయం తీసుకొన్న యాజమాన్యం.. వేలం లో ఆచితూచి వ్యవహరించింది. కేఎల్ రాహుల్, డుప్లెసి, స్టార్క్‌లను కొనుగోలు చేసినా.. అనూహ్యంగా అక్షర్ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా డుప్లెసి వ్యవహరిస్తాడు. స్టబ్స్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రాహుల్, డుప్లెసి, కరుణ్ నాయర్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. స్టార్క్‌తోపాటు నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మను కొనుగోలు చేసి బౌలింగ్‌ను బలోపేతం చేసింది. అక్షర్, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్లు. పాంటింగ్ స్థానంలో హెడ్ కోచ్‌గా హేమంగ్ బదానీని తీసుకొన్న మేనేజ్‌మెంట్.. కెవిన్ పీటర్సన్‌ను మెంటార్‌గా నియమించుకొంది. ఓవరాల్‌గా జట్టు సమతుల్యంగా కనిపిస్తున్నా.. కెప్టెన్‌గా అనుభవంలేని అక్షర్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
జట్టు
బ్యాటర్లు: ఫా డుప్లెసి, కరుణ్ నాయర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్;
వికెట్ కీపర్లు: రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డోనోవాన్ పెరీరా;
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, దర్శన్ నల్కండే, విప్‌రాజ్ నిగమ్, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ;
బౌలర్లు: మిచెల్ స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్.
ఇవి కూడా చదవండి..
Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి