Share News

IPL 2025 Season: ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు నమ్మితే గోవిందా గోవిందా

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:13 AM

కొన్ని బెట్టింగ్ యాప్‌లు డిపాజిట్‌పై బోనస్‌లు, లాస్ అమౌంట్‌పై బోనస్‌లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్‌లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని గుర్తించాలి.

IPL 2025 Season: ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు నమ్మితే గోవిందా గోవిందా
IPL Betting Apps Scam

ఏవైనా పండుగల సమయంలో ఎలక్ట్రిక్ వస్తువులు, దుస్తులతో పాటు వివిధ రకాల వస్తువులపై కంపెనీలు, సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సాధారణంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే సమయంలో టీవీలపై ఆఫర్లు ప్రకటించేవాళ్లు. ప్రస్తుతం ఐపీఎల్‌కు క్రేజ్ ఎక్కువుగా ఉండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే టైమ్‌‌లోనూ టీవీలపై ఆఫర్లను వివిధ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అలాగే మ్యాచ్ చూసే టైమ్‌లో తింటూ రిలాక్స్ అవ్వండంటూ ఫుడ్ డెలివరీ సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి. పనిలో పనిగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు సైతం తమ సైట్‌లో ఆడితే ఆఫర్లంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి.


ఏవైనా వస్తువు కొనుక్కుంటే దానిని వాడుకుంటాం. ఏదో ఒక ఉపయోగం ఉంటుది. కానీ బెట్టింగ్ ‌యాప్‌ల ఆఫర్లకు ఆకర్షితులైతే చేతులారా జీవితాలను గుల్ల చేసుకున్నవాళ్లవుతారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌గా బెట్టింగ్ యాప్ సంస్థలు బంపర్ బొనంజా అంటూ ఆఫర్ల పేరుతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయి. ఆఫర్ల వెనుక మతలబు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


50 శాతం రిఫండ్ పేరుతో

కొన్ని బెట్టింగ్ యాప్‌లు డిపాజిట్‌పై బోనస్‌లు, లాస్ అమౌంట్‌పై బోనస్‌లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్‌లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఒక యాప్‌కు సంబంధించిన నిర్వహకులు తమ సైట్ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి మ్యాచ్‌కు ముందు ఎవరు గెలుస్తారో ఒక టీమ్‌ను అంచనా వేస్తారు. తాము చెప్పిన టీమ్‌పై బెట్టింగ్ వేస్తే ఓడిపోతే 50 శాతం రిఫండ్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పోయినా సగం డబ్బులు వస్తాయనే ఆశతో చాలామంది బెట్టింగ్ వేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ తమ కష్టార్జితం సగం డబ్బులు పోతున్నాయనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. బెట్టింగ్ యాప్‌లు ఇచ్చే బోనస్‌లు బోగస్ అని గుర్తించకపోతే మన డబ్బును చేజేతులా పోగొట్టకున్నట్లే.


ఫస్ట్ మ్యాచ్‌లో

కోల్‌కతా నైట్ రైటర్స్, బెంగళూరు మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌‌లో కోల్‌కతా గెలుస్తుందంటూ ఓ బెట్టింగ్ యాప్ సంస్థ అంచనా వేసింది.దీనిని తమ గ్రూపు ఛానల్‌లో ప్రమోట్ చేసింది. తీరా కోల్‌కతా ఓడిపోయింది. 50 శాతం రిఫండ్ ఇఛ్చినప్పటికీ సగం డబ్బును చేతులారా కోల్పోయినట్లైది. ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.50వేలు ఒక జట్టుపై బెట్ కడితే ఆ టీమ్ ఓడిపోతే అతడికి వచ్చేది ర.25 వేలు. కానీ రూ.25 వేలు అతడు కోల్పోయాడు. ఇలా బోనస్‌లు, ఆఫర్ల వెనుక మోసాలు తెలుసుకోకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు చాలామంది యువత బలైపోతున్నారు. ఇటువంటి యాప్‌లపై ప్రభుత్వం సీరియస్‌గ వ్యవహారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌.. కొత్త నిబంధనలు?

Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 23 , 2025 | 11:05 AM