Share News

Gavaskar: టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:51 AM

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సలను 1996-97 నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీగా పిలుస్తున్నారు. అయితే తాజా సిరీస్‌లో ట్రోఫీని ఆ ఇద్దరు దిగ్గజాలు సంయుక్తంగా అందిస్తే బావుండేది...

Gavaskar: టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సలను 1996-97 నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీగా పిలుస్తున్నారు. అయితే తాజా సిరీస్‌లో ట్రోఫీని ఆ ఇద్దరు దిగ్గజాలు సంయుక్తంగా అందిస్తే బావుండేది. కానీ బోర్డర్‌ ఒక్కడే బహూకరించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో గవాస్కర్‌ మైదానంలోనే ఉన్నాడు. అయితే ఈ టెస్టుకు ముందే సన్నీకి ఈ విషయంలో అధికారులు స్పష్టతనిచ్చారట. ‘ఒకవేళ భారత్‌ సిడ్నీ టెస్టులో ఓడినా, డ్రా చేసుకున్నా ట్రోఫీని అందించేటప్పుడు మీ అవసరం లేదని నాకు చెప్పారు. ఆ సమయంలో కాస్త అయోమయానికైతే గురయ్యా. ఎందుకంటే ఇది బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కదా. ఇద్దరం కలిసి అందిస్తేనే బావుంటుంది. ఆసీస్‌ గెలిచినందుకు నేను భారతీయుడిని కాబట్టి ట్రోఫీని అందించకూడదేమో’ అని గవాస్కర్‌ అన్నాడు. మరోవైపు సన్నీని ఆహ్వానించకపోవడంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పందించింది. ఇద్దరినీ వేదికమీదకు పిలిస్తే బావుండేదని, కానీ ఆసీస్‌ గెలిస్తే బోర్డర్‌.. భారత్‌ గెలిస్తే గవాస్కర్‌ ట్రోఫీని అందించాలని ముందే నిర్ణయించినట్టు తేల్చింది.

Updated Date - Jan 06 , 2025 | 10:51 AM