Share News

క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:11 AM

గాయత్రి గోపీచంద్‌/ట్రీసా జాలీ జోడీ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం...

క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

బాసెల్‌: గాయత్రి గోపీచంద్‌/ట్రీసా జాలీ జోడీ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం 21-12, 21-8తో సెలిన్‌/అమీలీ (జర్మనీ) జంటని చిత్తు చేసింది. అయితే శ్రీకాంత్‌ 15-21, 11-21తో లీ షీఫెంగ్‌ (చైనా) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలాగే ప్రియాన్షు రజా వత్‌ 10-21, 11-21తో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌ రౌండ్‌-16లో అనుపమా ఉపాధ్యాయ 17-21, 19-21తో పీకే వర్దని (ఇండోనేసియా) చేతిలో, ఇషారాణి బారువా 19-21, 21-18, 18-21తో హాన్‌ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు.

ఇవి కూడా చదవండి..

Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడాతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 03:11 AM