Chennai: రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:20 AM
రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు జరిపిన సంఘటన ఇది. చెన్నై మహా నగరంలో మహారాజా అనే రౌడీషీటర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆయన పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అలాగే ఆయనపై చాలా కేసులు నమోదై ఉన్నాయి.

చెన్నై: స్థానిక గిండీలో శుక్రవారం తెల్లవారుజామున పేరుమోసిన రౌడీ షీటర్ మహారాజా(Maharaja)పై గ్రేటర్ చెన్నై పోలీసులు(Frester Chennai Police) కాల్పులు జరిపిన సంఘటన రౌడీల్లో కలవరం పుట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. తూత్తుకుడి జిల్లాకు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ మహారాజాపై తిరునల్వేలి, తూత్తుకుడి తదితర జిల్లాలో హత్యాయత్నం, దౌర్జన్యం కేసులున్నాయి. అతను వారం రోజుల క్రితం తూత్తుకుడి నుండి నగరానికి వచ్చిన ఓ ముఠా ఆరంబాక్కంకు చెందిన నగల దుకాణం యజమానిని కిడ్నాప్ చేసి హతమార్చేందుకు రూపొందించిన పథకాన్ని పసిగట్టిన పోలీసులు భగ్నంచేసి, ఐదుగురిని అరెస్టు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: రెండేళ్ళలో 20 లక్షల ల్యాప్ టాప్లు
విచారణలో ఈ వ్యవహారంలో రౌడీషీటర్ మహారాజా కీలకపాత్ర పోషించారని తెలిసింది. దీంతో తిరునల్వేలి వెళ్ళిన ప్రత్యేక పోలీసు బృందం అక్కడి పోలీసుల సహకారంతో మహారాజా(Maharaja)ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం నగరానికి తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30గంటల ప్రాంతంలో గిండీకి చేరుకున్న సమయంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు యత్నించిన మహారాజా రాళ్లతో దాడిచేయగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రౌడీకి గాయాలయ్యాయి.
అతడిని ముందుగా సైదాపేట(Saidapet) ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం రాయపేట(Rayapet) ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఇదిలా వుండగా, స్కాట్లాండ్ పోలీసులకు ధీటుగా సంఘ విద్రోహుల ఆగడాలకు చెక్ పెడుతున్న రాష్ట్రపోలీసులు గడిచిన 48గంటల్లో ఏడుగురిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News