Share News

Indian Women Wrestlers: మనీషా పసిడి పట్టు

ABN , Publish Date - Mar 29 , 2025 | 07:02 AM

ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు గొప్ప ప్రదర్శన కనబరిచి రెండు పతకాలు సాధించాయి. మనీషా భన్వాలా స్వర్ణ పతకం గెలిచి, అంతిమ్‌ పంగల్‌ కాంస్య పతకం సాధించింది

Indian Women Wrestlers: మనీషా పసిడి పట్టు

పంగల్‌కు కాంస్యం జూ ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి‌ప్

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా చాంపియన్‌షి్‌పలో భారత మహిళా రెజ్లర్లు రెండోరోజూ అమోఘ ప్రదర్శన కనబరచి రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. మనీషా భన్వాలా (62కి.) పసిడి పతకం కొల్లగొట్టగా, అంతిమ్‌ పంగల్‌ (53కి.) కాంస్య పతకం సాధించింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన 62 కి. విభాగం ఫైనల్లో మనీషా 8-7తో కిమ్‌ ఓక్‌ జే (కొరియా)ని ఓడించి స్వర్ణ పతకం పట్టేసింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కిదే తొలి పసిడి పతకం కావడం విశేషం. తొలి బౌట్‌లో 11-0తో దుబేక్‌ (కజకిస్థాన్‌)పై గెలుపొందిన మనీషా..క్వార్టర్‌ఫైనల్లో 3-0తో లీ (కొరియా)పై, సెమీఫైనల్లో 5-1తో కల్మిరా (కిర్గిస్థాన్‌)పై విజయం సాధించింది. 53 కి.విభాగం కాంస్య పతక పోరులో 20 ఏళ్ల పంఘల్‌ 10-0తో మెంగ్‌ హువాన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన జిన్‌ జాంగ్‌ను 10-6తో ఓడించిన అంతిమ్‌ సెమీఫైనల్లో మో కియోకా (జపాన్‌) చేతిలో 0-10తో ఓడిపోయింది. నేహా శర్మ (57కి.), మోనిక (65కి.), జ్యోతి బెరివాల్‌ (72కి.) పతక రౌండ్‌కు క్వాలిఫై కాలేక పోయారు. గురువారంనాడు మహిళలు మూడు పతకాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక..ఈ చాంపియన్‌షి్‌పలో ఇప్పటి వరకు భారత్‌ మొత్తం ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. మహిళలు ఐదు పతకాలు నెగ్గగా, పురుషులు గ్రీకో రోమన్‌లో రెండు పతకాలు అందుకున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 07:02 AM