India Australia relations: భారత్, ఆస్ట్రేలియా మధ్య గాఢానుబంధం
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:15 AM
భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆస్ట్రేలియన్ వైస్ కాన్సుల్ జనరల్ కత్రినా నాప్ పేర్కొన్నారు. ‘మైత్రి’ స్కాలర్‌షిప్‌లు, పరిశోధనా గ్రాంట్‌లు వంటి విద్యా, ఆర్థిక సహకారాలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.

ఆస్ట్రేలియా వైస్ కాన్సుల్ జనరల్ కత్రినా నాప్
చెన్నై, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గాఢానుబంధం వుందని చెన్నైలోని ఆస్ట్రేలియన్ వైస్ కాన్సుల్ జనరల్ కత్రినా నాప్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ‘వీఐటీ-చెన్నై’ యూనివర్సిటీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కత్రినా నాప్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో వున్న ఒక మిలియన్ భారతీయులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. వారు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపకత, వృద్ధికి పునాది వేయడం ద్వారా ఇక్కడి శ్రామిక శక్తిని నైపుణ్యం చేయడం ద్వారా భారత్‌కు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ రంగాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో ‘సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా-ఇండియా రిలేషన్స్’, ప్రభుత్వం, పరిశ్రమ, విద్య, సమాజం అంతటా ఆస్ట్రేలియన్ మిషన్ల సహకారంతో మద్దతు ఇవ్వడానికి, సులభతరం చేయడానికి ఒక వేదిక అని వివరించారు. ‘మైత్రి’ ద్వారా ఆస్ట్రేలియా 20 మిలియన్ డాలర్ల విలువైన ఫెలోషి్‌పలు, స్కాలర్‌షి్‌పలు, పరిశోధనా గ్రాంట్‌ను ప్రకటించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాధన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీవీ సెల్వం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హ్యూమన్ రిసోర్సెస్ చీఫ్ ఆఫీసర్ సుదీప్ కన్నుమల్, వీఐటీ చెన్నై రిజిస్ట్రార్ డాక్టర్ పీకే మనోహరన్, ప్రొ-వై్‌సఛాన్స్‌లర్ డాక్టర్ టి.త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.