IPL 2025, GT vs MI: గుజరాత్‌కు తొలి విజయం.. ముంబైపై గెలుపు
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:35 PM
తాజా ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు.

తాజా ఐపీఎల్ (IPL 2025) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (40 బంతుల్లో 63), శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ చూడ చక్కని షాట్లతో ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే మంచి ఆరంభాన్ని శుభ్‌మన్ గిల్ మరోసారి భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మరోవైపు సాయి సుదర్శన్ మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జాస్ బట్లర్ (24 బంతుల్లో 39) రాణించాడు. షారూక్ ఖాన్ (9) విఫలమయ్యాడు. తెవాటియా (0) రనౌట్ అయి వెనుదిరిగాడు. చివర్లో రూధర్‌ఫర్డ్ (18) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, చాహర్, ముజ్బిర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు రోహిత్ (8), రికెల్టన్ (6)లను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. అనంతరం తిలక్ వర్మ (39)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (48) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే తిలక్ అవుటైన తర్వాత వచ్చిన మింజ్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఆ వెంటనే సూర్య కూడా అవుటైపోయాడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన హార్దిక్ పాండ్యా (11) రబాడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివరకు సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ కావడంతో ముంబై లక్ష్యం వైపు సాగలేకపోయింది. ముంబై బౌలర్లలో మహ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి