IPL 2025, PBKS vs GT: చితక్కొట్టిన అయ్యర్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:14 PM
ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు అనకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడాడు.

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. బలమైన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది (PBKS vs GT). బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా అయ్యర్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 97 నాటౌట్) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (5) త్వరగానే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47) త్రుటిలో అర్ధశతకాన్ని మిస్ అయ్యాడు. మంచి జోరు మీదున్న ఆర్యను రషీద్ ఖాన్ గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఇది రషీద్ ఖాన్‌కు ఐపీఎల్‌లో 150వ వికెట్. మ్యాక్స్‌వెల్ డకౌట్ అవడంతో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ (20) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. చివర్లో శశాంక్ (16 బంతుల్లో 44) కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా పంజాబ్‌కు కలిసి వచ్చింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రషీద్ ఖాన్, రబాడా ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 20 ఓవర్లలో 244 పరుగులు చేయాల్సి ఉంది. ఇక, భారమంతా గుజరాత్ బ్యాటర్లపైనే ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..