Share News

Breaking News: భద్రాచలంలో విషాదం కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం

ABN , First Publish Date - Mar 26 , 2025 | 08:28 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: భద్రాచలంలో విషాదం కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం
Breaking News

Live News & Update

  • 2025-03-26T15:29:50+05:30

    భద్రాచలంలో విషాదం కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం

    • భద్రాచలం లో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నేలమట్టం

    • అనుమతులు లేకుండా నిర్మాణం

    • ఒక్కసారిగా కుప్ప కూలిన భవనం

    • శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

    • సహాయ చర్యలు చేపట్టిన రెస్క్యూ అండ్ పోలీస్ టీం

  • 2025-03-26T14:12:25+05:30

    వైసీపీ నేతల కారుల్లో మందుగుండు సామగ్రి..

    • సత్యసాయి జిల్లా: రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఉద్రిక్తత

    • వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

    • పలు వాహనాలు ధ్వంసం, ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

    • ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్

    • వైసీపీ నేతల వాహనాల్లో వేట కొడవళ్లు, మందు గుండు సామగ్రి గుర్తించిన పోలీసులు

    • తమ దగ్గర తుపాకులు ఉన్నాయంటూ గతంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

    • ప్రకాశ్ రెడ్డి సోదరులు వాడే వాహనాల్లోనే మారణాయుధాలు, మందుగుండు సామగ్రి గుర్తింపు

    • ఆ వాహనాలను రామగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

  • 2025-03-26T14:04:48+05:30

    పూజారికి జీవిత ఖైదు విధించిన కోర్టు..

    • రంగారెడ్డి: సరూర్ నగర్‍లో మహిళ హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

    • మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేసిన పూజారి సాయి

    • శంషాబాద్‌లో హత్య చేసి కారులో తీసుకెళ్లి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టిన నిందితుడు

    • నాలుగేళ్లపాటు మహిళతో ప్రేమకలాపాలు నడిపి ముఖం చాటేసిన పూజారి

    • పెళ్లి చేసుకోమని అడగడంతో కిరాతకంగా హత్య చేసిన పూజారి సాయి

    • ఈ కేసులో పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు

    • సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు అదనంగా జైలు శిక్ష

  • 2025-03-26T13:30:11+05:30

    మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తీవ్రగాయాలు..

    • తిరుపతి: బాత్‌రూమ్‌లో జారిపడిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

    • పెద్దిరెడ్డి కుడిచేయి ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారణ

    • ప్రైవేట్ ఆస్పత్రిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చికిత్స

  • 2025-03-26T12:56:36+05:30

    పాస్టర్ మృతిపై హోంమంత్రి అనిత ఆరా..

    • రాజమహేంద్రవరం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి అనిత

    • తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన హోంమంత్రి

    • పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత

    • పాస్టర్ ప్రవీణ్‌ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశం

    • క్రైస్తవ సంఘాలు కోరిక మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలిపిన ఎస్పీ

  • 2025-03-26T12:53:56+05:30

    పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు..

    • రాజమహేంద్రవరం: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి

    • పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణ జరపాలంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద ఆందోళన

    • రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగిన పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు

    • తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

  • 2025-03-26T12:48:54+05:30

    పాస్టర్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

    • రాజమహేంద్రవరం: హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

    • పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించిన చంద్రబాబు

    • ఈ విషయంపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • రాజమహేంద్రవరం చాగల్లులో క్రైస్తవ సభలకు వస్తుండగా మృతిచెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల

  • 2025-03-26T12:19:03+05:30

    కాంగ్రెస్ మాదిగ వర్గం ఎమ్మెల్యేలు లేఖ..

    • హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కి కాంగ్రెస్ మాదిగవర్గం ఎమ్మెల్యేల లేఖ

    • మంత్రివర్గంలో మాదిగ నేతకి అవకాశమివ్వాలంటూ మీనాక్షికి లేఖ రాసిన ఎమ్మెల్యేలు

    • రాష్ట్ర జనాభాలో దాదాపు 45 లక్షల మంది మాదిగలు ఉన్నారని లేఖలో పేర్కొన్న ఎమ్మెల్యేలు

    • గతేడాది ఎన్నికల్లో మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని లేఖలో తెలిపిన ఎమ్మెల్యేలు

  • 2025-03-26T12:11:09+05:30

    ఎమ్మెల్యే కేటీఆర్‌పై కేసు నమోదు..

    • నల్లగొండ: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో చెలరేగిన రాజకీయ దుమారం

    • పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు

    • కేటీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తప్పుడు ఆరోపణలు చేశారంటూ నకిరేకల్ పీఎస్‌లో ఫిర్యాదు

    • కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ రజిత శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ఉగ్గడి శ్రీనివాస్

    • మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ ఛైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్

    • తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన రజిత శ్రీనివాస్

    • కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ సైతం సోషల్ మీడియాపై ఫిర్యాదు

    • వారి ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై నకిరేకల్ పీఎస్‌లో రెండు కేసులు నమోదు

  • 2025-03-26T11:36:46+05:30

    తూర్పుగోదావరి జిల్లా దారుణం..

    • తూర్పుగోదావరి: అనపర్తి మండలంలో రెచ్చిపోయిన కామాంధులు

    • మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన దుర్మార్గులు

    • ఆ వీడియో చూపించి కోర్కెలు తీర్చాలంటూ బాధితురాలికి బెదిరింపులు

    • కామాంధుల వేధింపులు తాళలేక అనపర్తి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

    • ఆమె ఫిర్యాదు ఆధారంగా నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

  • 2025-03-26T11:12:51+05:30

    కలకలం రేపిన మగశిశువు విక్రయం

    • కామారెడ్డి: క్యాసంపల్లిలో కలకలం రేపిన మగశిశువు విక్రయ వ్యవహారం

    • ఈనెల 19న సిరికొండ మండలానికి చెందిన వారికి బాబును బేరం పెట్టిన మధ్యవర్తులు

    • రూ.55 వేలకు చిన్నారి విక్రయించేందుకు ఒప్పందం

    • మధ్యవర్తులు, బిడ్డను అమ్మిన వారికి మధ్య పంపకాల వద్ద గొడవ

    • వారి గొడవతో వెలుగులోకి వచ్చిన దారుణం

    • కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

  • 2025-03-26T10:34:26+05:30

    దారుణం.. చిన్నారిపై రెచ్చిపోయిన కామాంధుడు..

    • అల్లూరి జిల్లా: ఎటపాక మండలంలో దారుణ ఘటన

    • నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు

    • బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

    • చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో దర్యాప్తు

  • 2025-03-26T10:31:48+05:30

    ఒక్కసారిగా వెనక నుంచి లారీని ఢీకొట్టిన బస్సు.. ఆ తర్వాత..

    • యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద 65వ జాతీయ రహదారిపై ఢీకొన్న లారీ, ట్రావెల్స్ బస్సు

    • కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, ఆ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన మరో బస్సు

    • రెండు బస్సుల డ్రైవర్లకు, ప్రయాణికులకు తీవ్రగాయాలు, చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలింపు

  • 2025-03-26T10:26:47+05:30

    మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత..

    • హైదరాబాద్‌: మాజీమంత్రి కొడాలి నానికి అస్వస్థత

    • గ్యాస్ట్రిక్‌ సమస్యతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని

    • టెస్టుల తర్వాత గుండె సమస్యలు ఉన్నట్టు తేల్చిన వైద్యులు

    • ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నానికి కొనసాగుతున్న చికిత్స

    • నాని ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయనున్న వైద్యులు

  • 2025-03-26T08:50:48+05:30

    లారీ ఢీకొని భార్యభర్త మృతి..

    • అల్లూరి జిల్లా: పాడేరు- అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం

    • హుకుంపేట మండలం కోట్నాపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

    • లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు

  • 2025-03-26T08:36:12+05:30

    ఘోర రోడ్డుప్రమాదం..

    • హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం

    • ప్రమాదవశాత్తూ కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

    • ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి

  • 2025-03-26T08:28:01+05:30

    ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు..

    • రంగారెడ్డి: మహేశ్వరం పరిధి రావిర్యాల ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

    • ఇద్దరు నిందితులు హర్యానా రాష్ట్రం మేవాత్‌కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు

    • ఈనెల 3న రావిర్యాలలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.13 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులు

    • నిందితులు ముంబై వైపునకు వెళ్తూ మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీకి యత్నం

    • షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, అక్కడ్నుంచి పారిపోయిన దొంగలు

    • నిందితుల కోసం మేవత్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలు, స్థానికుల సహాయంతో అరెస్టు

    • నిందితుల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన యంత్రం, ఇతర సామగ్రి స్వాధీనం