Share News

రిటైర్మెంట్‌.. ఇప్పుడే కాదు..!

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:02 AM

తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను ధోనీ కొట్టిపడేశాడు. ఈ సీజన్‌ చివరి వరకు ఆడతానని స్పష్టం చేశాడు. శనివారం చెపాక్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు మహీ తల్లిదండ్రులు హాజరు కావడంతో...

రిటైర్మెంట్‌.. ఇప్పుడే కాదు..!

  • స్పష్టతనిచ్చిన ధోనీ

న్యూఢిల్లీ: తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను ధోనీ కొట్టిపడేశాడు. ఈ సీజన్‌ చివరి వరకు ఆడతానని స్పష్టం చేశాడు. శనివారం చెపాక్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు మహీ తల్లిదండ్రులు హాజరు కావడంతో అతడికి ఇదే చివరి మ్యాచ్‌ అనే వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. కానీ, మ్యాచ్‌ ముగిసిన తర్వాత మహీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు. ఓ పాడ్‌కా్‌స్టలో తన రిటైర్మెంట్‌ ఊహాగానాలను ధోనీ ఖండించాడు. ‘ఇప్పటికిప్పుడు లీగ్‌కు గుడ్‌బై చెప్పలేను. ఈ సీజన్‌ ముగిసిన తర్వాత.. జూలైలో 44వ సంవత్సరంలోకి అడుగుపెడతా. ఇంకా ఆడా లా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి అప్పటికి మరో 10 నెలల సమయం ఉంటుం ది. నా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకొనేది నేను కాదు.. నా శరీరం. సీజన్‌ ఆరంభానికి ముం దు శరీరం సహకరిస్తుంటే ఆడతా. లేకపోతే గుడ్‌బై చెబుతాన’ని ధోనీ చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 05:02 AM