Share News

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:59 PM

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ 2023లో ప్రవేశపెట్టిన కొత్త వెసులుబాటు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నియమం ప్రకారం.. ఓ జట్టు ఒక ఆటగాడిని మరొక ఆటగాడితో భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ జట్టు బౌలింగ్ పూర్తి చేసిన తర్వాత, తమ బౌలర్‌ను ఓ బ్యాటర్‌తో భర్తీ చేసుకోవచ్చు.

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
MS Dhoni

ఐపీఎల్‌లో (IPL 2025) ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ 2023లో ప్రవేశపెట్టిన కొత్త వెసులుబాటు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నియమం ప్రకారం.. ఓ జట్టు ఒక ఆటగాడిని మరొక ఆటగాడితో భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ జట్టు బౌలింగ్ పూర్తి చేసిన తర్వాత, తమ బౌలర్‌ను ఓ బ్యాటర్‌తో భర్తీ చేసుకోవచ్చు. అంటే బౌలింగ్ ఒకరితో, బ్యాటింగ్ మరొకరితో చేయించుకోవచ్చు. ఇది జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ (Impact player) అనేది అంతర్జాతీయ ఫార్మాట్‌లో అందుబాటులో లేదు.


ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది మాజీలు తప్పు పడుతున్నారు. ఈ నిబంధన కారణంగా ఆల్ రౌండర్ల అవసరం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కూడా ఈ నిబంధన పట్ల అంత సానుకూలంగా లేడు. 2024లో ధోనీ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగినప్పటికీ, 2023లో మాత్రం ఈ నిబంధనను వ్యతిరేకించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌ గురించి 2023లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రస్తుతం మంచి స్థానంలో ఉందని, దానికి మరింత మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.


* ఐపీఎల్ నిజంగా అద్భుతం. నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాం. ప్రతిభావంతులైన క్రికెటర్లు వస్తున్నారు. యువ క్రికెటర్లకు మంచి వేదిక దొరికింది. టీఆర్‌పీ బాగుంది. అది చాలు.. ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఆల్‌రౌండర్ల అవసరాన్ని తగ్గిస్తుంది * అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఇక, చెన్నై కెప్టెన్సీ విషయంలో కూడా ధోనీ స్పందించాడు. మ్యాచ్‌కు సంబంధించి 99 శాతం నిర్ణయాలన్నీ రుతురాజ్ మాత్రమే తీసుకుంటాడని, తాను కేవలం అతడికి అప్పుడప్పుడు సలహాలు మాత్రమే ఇస్తుంటానని ధోనీ చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం


Dhoni-Kohli: ఆ మెసేజ్ ఏంటో చెప్పను.. కోహ్లీకి పంపిన సందేశం గురించి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు


MS Dhoni: ధోనీ రియాక్షన్ టైమ్ 0.12 సెకెన్లు.. అవాక్కైన మాజీ క్రికెటర్లు..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2025 | 05:59 PM