Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో సూపర్ బైక్.. ధర, స్పెషల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:46 PM
Royal Enfield Classic 650: బైకర్లను మెస్మరేజ్ చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సరికొత్త సూపర్ మోడల్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజే విడుదలైన క్లాసిక్ 650 హాట్‌రాడ్, క్లాసిక్, క్రోమ్ వంటి 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర, స్పెసిఫేకషన్స్, స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే..

Royal Enfield Classic 650 Released: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బైక్ ప్రియులు చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న మరో సూపర్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది. 650 సిరీస్‌లో భాగంగా గురువారం లాంఛ్ అయిన క్లాసిక్ 650 బుకింగ్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. రూ. 3.37లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీన్ని విడుదల చేశారు. ఇందులో బ్లాక్ క్రోమ్ వేరియంట్ ధర అత్యధికంగా రూ. 3.50 లక్షలుగా ఉంది. 650 సీసీ సిరీస్‌లో ఇది ఆరవది. ఇంతకుముందు ఇంటర్‌సెప్టర్ 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650, బేర్ 650, కాంటినెంటల్ జీటీ 650 విడుదలయ్యాయి. స్టైలిష్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ పూర్తి వివరాలు ..
ఇంజిన్ ఎలా ఉందంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ఇంజిన్‌లో పెద్దగా మార్పుల్లేవు. నియో రెట్రోలుక్‌ను కొనసాగించారు. క్లాసిక్ 350లాగే ఉండే ఈ బైక్‌లో 647cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది.46.4 hp పవర్, 52.3Nm టార్క్ పవర్ ఉత్పత్తి చేసే అదే 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేశారు. 19 Inches ఫ్రంట్ వీల్, 18 Inches రియర్ వీల్ అమర్చారు. వైర్ స్పోక్ వీల్స్ ఏర్పాటు చేశారు.ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే దీనికి LED లైట్లు, సెమీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-ఛానల్ ABS సహా అనేకం ఉన్నాయి. బ్రంటింగ్‌థార్ప్ బ్లూ, టీల్, బ్లాక్ క్రోమ్, వల్లం రెడ్ రంగుల్లో ఈ బైక్ దొరుకుతుంది.
ధర, ఫీచర్లు..
బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన క్లాసిక్ 650 ముందువైపు 320mm డిస్క్ బ్రేక్, వెనక వైపు 300mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు.సింగిల్-సీట్ సెటప్ ఉండే ఈ బైక్ బరువు 243 కిలోలు. ఇప్పటివరకు అత్యంత బరువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే కానుంది. MRF టైర్లతో వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ ఎక్స్-షోరూమ్ అంచనా ధర రూ. 3.5 లక్షలు. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.