Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:22 PM
హర్భజన్ సింగ్ తాజాగా ఉప్పల్‌లో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రంగును ఉద్దేశించి మాట్లాడాడు. అవి జాత్యాహంకార వ్యాఖ్యలు అంటూ నెటిజన్లు తప్పుపడుతున్నారు.

తనదైన శైలిలో ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్ తాజాగా ఉప్పల్‌లో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ (SRH vs RR) మ్యాచ్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) రంగును ఉద్దేశించి మాట్లాడాడు. అవి జాత్యాహంకార వ్యాఖ్యలు అంటూ నెటిజన్లు తప్పుపడుతున్నారు (Harbhajan Singh Racism comments).
ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ రెండు ఫోర్లు బాదాడు. ఆ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ.. లండన్‌లో నల్ల ట్యాక్సీల మీటర్ వేగంగా పరిగెడుతుందని, ఇక్కడ ఆర్చర్ సాబ్ మీటర్ కూడా వేగంగా పరిగెడుతోంది అంటూ హర్భజన్ కామెంట్ చేశాడు. ఆర్చర్ రంగును పరోక్షంగా ఉద్దేశిస్తూ.. ఆ నల్ల ట్యాక్సీలతో పోల్చడంపై వివాదం రాజుకుంది.
ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్భజన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతడిపై విమర్శలు చేస్తున్నారు. భజ్జీని వెంటనే కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు భజ్జీ అత్యంత అహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. వెంటనే అతడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Dhoni-Kohli: ఆ మెసేజ్ ఏంటో చెప్పను.. కోహ్లీకి పంపిన సందేశం గురించి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni: ధోనీ రియాక్షన్ టైమ్ 0.12 సెకెన్లు.. అవాక్కైన మాజీ క్రికెటర్లు..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..