అదరగొట్టిన బ్రంట్
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:40 AM
నటాలి సివర్ బ్రంట్ (57, 2/26) ఆల్‌రౌండ్ షోతో.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌ను...

డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ X యూపీ
రాత్రి 7.30 నుంచి
ముంబై బోణీ ఫ 5 వికెట్లతో గుజరాత్ చిత్తు
వడోదర: నటాలి సివర్ బ్రంట్ (57, 2/26) ఆల్‌రౌండ్ షోతో.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. హర్లీన్ డియోల్ (32), కశ్వీ గౌతమ్ (20) టాప్ స్కోరర్లు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ముంబై 16.1 ఓవర్లలో 122/5 స్కోరు చేసి గెలిచింది. ప్రియా మిశ్రా, కశ్వీ చెరో 2 వికెట్లు తీశారు.
సునాయాసంగా..: బ్రంట్ అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. ముంబై అలవోకగా నెగ్గింది. స్వల్ప లక్ష్య ఛేదనను ముంబై ఓపెనర్లు హేలీ (17), యాస్తిక భాటియా (8) ధాటిగా ఆరంభించారు. మూడు ఫోర్లతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న హేలీని తనూజ క్యాచవుట్ చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రంట్ కూడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 37/1తో నిలిచింది. అయితే, భాటియాను ప్రియ క్యాచవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బౌండ్రీతో ఖాతా తెరిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (4)ను కశ్వీ పెవిలియన్ చేర్చింది. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ముంబై స్కోరు కొంత నెమ్మదించింది. అయితే, 13వ ఓవర్‌లో ప్రియ బౌలింగ్‌లో అమేలియా కెర్ (19) 6,4తో వేగం పెంచింది. మరోవైపు బ్రంట్ రెండు బౌండ్రీలతో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. టీమ్ స్కోరు సెంచరీ దాటింది. కానీ, కెర్‌ను కశ్వీ ఎల్బీ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. విజయానికి 7 పరుగులు కావాల్సిన సమయంలో బ్రంట్‌ను ప్రియ బౌల్డ్ చేసింది. సజన (10 నాటౌట్), కమలిని (4 నాటౌట్) మరో 23 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.
పెవిలియన్‌కు క్యూ..: ముంబై బౌలర్ల దెబ్బకు.. గుజరాత్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. పవర్ ప్లేలో ఓపెనర్లు బెత్ మూనీ (1), లారా వోల్వార్డ్ (4), హేమలత (9)తోపాటు కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (10)ను కోల్పోయిన గుజరాత్ 28/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కశ్వీతో కలసి ఆరో వికెట్‌కు, తనూజ (13)తో కలసి ఎనిమిదో వికెట్‌కు 24 పరుగుల చొప్పున భాగస్వామ్యాలు నెలకొల్పిన డియోల్.. జట్టు స్కోరును సెంచరీ మార్క్ దాటించింది.
స్కోరుబోర్డు
గుజరాత్: బెత్ మూనీ (సి) సంస్కృతి (బి) బ్రంట్ 1, లారా (సి) సజన (బి) ఇస్మాయిల్ 4, హేమలత (సి) కెర్ (బి) మాథ్యూస్ 9, గార్డ్‌నర్ (సి) సజన (బి) బ్రంట్ 10, హర్లీన్ (సి) మాథ్యూస్ (బి) అమన్‌జోత్ 32, డోటిన్ (స్టంప్డ్) భాటియా (బి) కెర్ 7, కశ్వీ (స్టంప్డ్) భాటియా (బి) మాథ్యూస్ 20, సిమ్రన్ (సి) కెర్ (బి) మాథ్యూస్ 3, తనూజ (సి) సంస్కృతి (బి) కెర్ 13, సయాలి (నాటౌట్) 13, ప్రియ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 120 ఆలౌట్; వికెట్ల పతనం: 1-6, 2-14, 3-16, 4-28, 5-43, 6-67, 7-79, 8-103, 9-103; బౌలింగ్: షబ్నిం ఇస్మాయిల్ 4-1-17-1, నటాలి సివర్ బ్రంట్ 4-0-26-2, హేలీ మాథ్యూస్ 4-0-16-3, అమేలియా కెర్ 4-0-22-2, పరుణిక 2-0-20-0, అమన్‌జోత్ కౌర్ 2-0-17-1.
ముంబై: హేలీ మాథ్యూస్ (సి) హర్లీన్ (బి) తనూజ 17, యాస్తిక (సి) లారా (బి) ప్రియ 8, బ్రంట్ (బి) ప్రియ 57, హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) కశ్వీ 5, కెర్ (ఎల్బీ) కశ్వీ 19, సంజన (నాటౌట్) 10, కమలిని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 16.1 ఓవర్లలో 122/5; వికెట్ల పతనం: 1-22, 2-46, 3-55, 4-100, 5-144; బౌలింగ్: గార్డ్‌నర్ 3-0-21-0, తనూజ కన్వర్ 3-0-25-1, డోటిన్ 3.1-0-19-0, ప్రియ 4-0-40-2, కశ్వీ 3-0-15-2.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..