Share News

కివీస్ దే బోణీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:43 AM

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను కూడా పాకిస్థాన్‌ ఓటమితోనే ఆరంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మార్క్‌ చాప్‌మన్‌ (132) శతక సహాయంతో ఆతిథ్య కివీస్‌...

కివీస్ దే బోణీ

తొలి వన్డేలో పాక్‌ ఓటమి

నేపియర్‌: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను కూడా పాకిస్థాన్‌ ఓటమితోనే ఆరంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మార్క్‌ చాప్‌మన్‌ (132) శతక సహాయంతో ఆతిథ్య కివీస్‌ 73 పరుగులతో గెలిచింది. ఇప్పటికే పాక్‌ ఐదు టీ20ల సిరీ్‌సను 4-1తో ఓడిన విషయం తెలిసిందే. ముందుగా కివీస్‌ 50 ఓవర్లలో 344/9 స్కోరు సాధించింది. మిచెల్‌ (76), మహమ్మద్‌ అబ్బాస్‌ (52) అర్ధసెంచరీలు చేశారు. భారీ ఛేదనలో పాక్‌ 44.1 ఓవర్లలో 271 రన్స్‌కే పరిమితమైంది. బాబర్‌ (78), సల్మాన్‌ ఆఘా (58) రాణించారు. నాథన్‌ స్మిత్‌కు 4, డఫీకి 2 వికెట్లు దక్కాయి. పాక్‌ మూలాలున్న అబ్బాస్‌ ఈ మ్యాచ్‌లో కివీస్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన అబ్బాస్‌.. అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 2021లో ఇంగ్లండ్‌పై 26 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన టీమిండియా ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా రికార్డును అధిగమించాడు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

Updated Date - Mar 30 , 2025 | 03:43 AM