రుద్రాంక్ష్‌కు పసిడి
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:59 AM
ఐఎ్‌సఎ్‌సఎఫ్ షూటింగ్ వరల్డ్‌క్‌పలో రుద్రాంక్ష్ భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించాడు. ఆదివారం జరిగిన పురుషుల...

బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఐఎ్‌సఎ్‌సఎఫ్ షూటింగ్ వరల్డ్‌క్‌పలో రుద్రాంక్ష్ భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ 252.9 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకొన్నాడు. ఇస్టావెన్ మార్టిన్ (హంగేరి) 251.7 పాయింట్లతో రజతం, మార్సెల్లో గుజెరజ్ (అర్జెంటీనా) 230.1 పాయింట్లతో కాంస్యం దక్కించుకొన్నారు. కాగా, క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన అర్జున్ బబూట ఏడో స్థానానికే పరిమితమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..