13 ఏళ్లకే బికీనీ.. నవాబుతో ప్రేమ.. మామూలు కథ కాదు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 08:49 PM
Sharmila Tagore And Massoor Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తల్లి శర్మిలా ఠాకూర్ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్.. మన్సూర్ ఒకప్పటి ఇండియన్ క్రికెటర్. 1960లలో వీరి ప్రేమ కథ చాలా ఫేమస్. శర్మిలను బతిమాలి, బామాలి, లాలించి మన్సూర్ పెళ్లి చేసుకున్నాడు.

శర్మిలా ఠాకూర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. వీళ్లు ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్లు ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులు. ఆ ఇద్దరూ ఆశామాషీ వ్యక్తులు కాదు.. శర్మిలా ఠాకూర్ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్.. మన్సూర్ ఒకప్పటి ఇండియన్ క్రికెటర్. వీరి ప్రేమ కథ 1960లలో దేశ వ్యాప్తంగా ఓ చర్చనీయాంశంగా మారింది. ఓ సంస్థానానికి నవాబైన మన్సూర్ తన ప్రేమను దక్కించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాడు. ఎన్నో కష్టాలు పడి తను ప్రేమించిన శర్మిలా ఠాకూర్‌ను సొంతం చేసుకున్నాడు. వీరి ప్రేమ కథ 1960ల నాటిదైనా ఇప్పటి కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
13 ఏళ్లకే బికినీ..
శర్మిలా ఠాకూర్ 13 ఏళ్ల వయసుకే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనదైన స్టైల్‌తో బాలీవుడ్‌ను మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకుంది. సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే బికినీ వేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. శర్మిల బికినీ ఫొటో ప్రముఖ సినిమా మ్యాగ్జైన్ ఫిల్మ్‌ఫేర్ కవర్ పేజీగా వచ్చింది. 1960లలో ఢిల్లీలో ఓ క్రికెట్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి శర్మిల వెళ్లింది. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. శర్మిలకు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదు. క్రికెట్ మ్యాచులు కూడా చూసేది కాదు.. ఇక, మన్సూర్ శర్మిల నటించిన ఒక్క సినిమాను కూడా అప్పటి వరకు చూల్లేదు.
అయినా ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. మన్సూర్ ఆమెను ప్రేమించటం మొదలెట్టాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా సర్కస్ చేశాడు. ఆమెకు అవసరమైన వస్తువులన్నీ కొని ఇంటికి పంపేవాడు. తరచుగా ప్రేమ లేఖలు.. రోజా పువ్వులు పంపేవాడు. కొన్ని రోజుల తర్వాత శర్మిల అతడి ప్రేమను అంగీకరించింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి కాగా.. మిగిలిన ఇద్దరు అమ్మాయిలు. ఆ అబ్బాయే మన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. మన్సూర్ అలీఖాన్ చనిపోయే వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. 2011లో మన్సూర్ చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
Waqf Bill: వక్ఫ్ బిల్లు ఉభయసభల్లో పాసవుతుందా? ఎన్డీయేకున్న బలమెంతంటే..
YS Jagan: చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. పాలనలో అబద్ధం