Elon Musk: మాస్క్ మామకు మళ్లీ దెబ్బ..తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నడా..
ABN , Publish Date - Apr 02 , 2025 | 09:13 PM
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. టెస్లా, ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, కంపెనీ తన మొదటి త్రైమాసికంలో అంచనాలు పూర్తిగా మారిపోయి, అమ్మకాలు 13% తగ్గాయి. ఇదే సమయంలో టెస్లా షేర్లు కూడా కుప్పకూలాయి.

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల అనేక వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశంగా మారిన మాస్క్ మామకు మరో షాక్ తగిలింది. టెస్లా, ప్రపంచంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీదారుగా ఉన్నప్పటికీ, ఇటీవల కంపెనీ తన మొదటి త్రైమాసికంలో అనుకున్నదాని కంటే కనిష్ట అమ్మకాలను నమోదు చేసింది. 2025 ప్రారంభంలో, టెస్లా CEO ఎలాన్ మస్క్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఈ కంపెనీ అమ్మకాలు 13% తగ్గాయి. ఇది దాదాపు మూడు సంవత్సరాల్లోని అత్యంత బలహీనమైన ప్రదర్శన కావడం విశేషం. దీంతో టెస్లా కంపెనీ స్టాక్స్ 6 శాతం మేర పడిపోయాయి.
కొత్త మోడల్స్
తాజా అంచనాల ప్రకారం, జనవరి-మార్చి త్రైమాసికంలో టెస్లా తన అమ్మకాలలో 336,681 వాహనాలు మాత్రమే విక్రయించింది. ఇది 2024లో 386,810 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే తగ్గింది. ఈసారి విశ్లేషకులు 372,410 వాహనాలు అమ్మే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ టెస్లా ప్రదర్శనలో రాణించలేదు. ఈ పతనం నేపథ్యంలో టెస్లా షేర్లు 2% తగ్గిపోయాయి. టెస్లా అమ్మకాల స్థాయిలు ఈ స్థాయిలో పడిపోవడం, టెస్లా పెట్టుబడిదారులను కలవర పెడుతోంది. 2025లో 20% - 30% అమ్మకాల వృద్ధిని సాధించాలనే టెస్లా లక్ష్యాలు కొత్త మోడల్స్ విడుదల చేయడమో లేదా ఇంకేదైనా చేస్తే గాని జరుగుతుందని చెప్పలేం.
క్రమంగా తగ్గిన మార్కెట్..
దీనికి ముందు టెస్లా బ్రాండ్ అగ్రగామిగా కొనసాగేది. కానీ ఎలోన్ మస్క్, రాజకీయ వ్యాఖ్యల వల్ల, అనేక మంది వినియోగదారులను ముఖ్యంగా యూరోప్, అమెరికా, చైనా వంటి ప్రధాన మార్కెట్లలో తనకు దూరం చేసుకున్నాడు. దీంతోపాటు మస్క్ రాజకీయ భావజాలంతో అమెరికాలో ఉద్యోగాల తొలగింపు వంటి వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వీటి కారణంగా టెస్లా వాహనాలపై వినియోగదారుల ఆదరణ క్రమంగా తగ్గింది. ఇందులో భాగంగా, యూరోప్, చైనా వంటి కీలక మార్కెట్లలో అమ్మకాలు అతి తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు టెస్లా మార్కెట్‌కి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఇతర సంస్థలతో పోటీ పెరగడం కూడా అమ్మకాల పతనానికి దారి తీసింది.
అగ్రస్థానంలో మాత్రం..
టెస్లా వాహన శ్రేణి తాజాగా రీఫ్రెష్ చేయబడలేదు. ఇది కూడా అమ్మకాలు తగ్గడానికి కారణమని నిపుణులు అంటున్నారు. చాలామంది వినియోగదారులు ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా చైనాలోని BYD వంటి సంస్థల కొత్త మోడళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. BYD ఈ సంవత్సరం మొదటి సారి ప్రపంచ వ్యాప్తంగా టెస్లాను మించి, 15.7% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది టెస్లా 15.3% కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రతి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మార్కెట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ, నిత్యం కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తోంది. కానీ టెస్లా మాత్రం తన బ్రాండ్ పేరు, డిజైన్ ద్వారా ముందంజలో నిలిచింది. కానీ ప్రస్తుతం అప్డేట్ చేసే విషయంలో మాత్రం అంతరాయం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..
Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News