Share News

Tadepalligudem: భర్త అంత్యక్రియలు ఆపించిన భార్య.. పోలీసులు ఎంట్రీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 09:08 PM

Tadepalligudem: ఓ భార్య.. తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో శ్మశానంలో అతడి అంత్యక్రియలు ఆపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tadepalligudem: భర్త అంత్యక్రియలు ఆపించిన భార్య.. పోలీసులు ఎంట్రీ

తాడేపల్లి గూడెం, ఏప్రిల్ 02: తన భర్త మృతిపై సందేహాలు న్నాయంటూ ఓ భార్య శ్మశాన వాటికలో బంధువులతో వాదానికి దిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆమె భర్త మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. కలగాని సత్తిబాబు అనే వ్యక్తి గత వారం రోజులుగా రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడు ఇటీవల మరణించాడు. దీంతో అతడికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు తాడేపల్లిగూడెంలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకు వచ్చారు.

అయితే తన భర్త మృతదేహంపై గాయాలుండంపై అతడి భార్య కలగాని స్వాతి అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త దహన సంస్కారాలను ఆమె ఆపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు శ్మశాన వాటికకు చేరుకుని.. సత్తిబాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


అయితే ఇప్పటి వరకు అతడితో కాపురమే వద్దంటూ కలగాని స్వాతి సత్తిబాబును వదిలి వెళ్లిపోయిందని అతడి బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా.. మూడు ముళ్లు వేసిన భర్త రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. కనీసం అటు వైపునకు ఆమె రాలేదని వారు విమర్శించారు. తమపై నిందలు వేసేందుకే ఇలాంటి చర్యలకు స్వాతి దిగిందని మృతుడు సత్తిబాబు బంధువులు ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక మృతుడి భార్య స్వాతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సత్తిబాబు బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 09:08 PM