Share News

పుణెలోనే పూర్తి చేస్తారా?

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:27 AM

వరుస విజయాల జోరులో టీమిండియా మూడో టీ20లోనే సిరీ్‌సను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌షోతో చెలరేగి ఆతిథ్య జట్టుకు బ్రేక్‌ వేసింది. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌...

పుణెలోనే పూర్తి చేస్తారా?

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

సిరీస్‌ లక్ష్యంగా భారత్‌

సమం కోసం ఇంగ్లండ్‌

నేడు నాలుగో టీ20

పుణె: వరుస విజయాల జోరులో టీమిండియా మూడో టీ20లోనే సిరీ్‌సను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌షోతో చెలరేగి ఆతిథ్య జట్టుకు బ్రేక్‌ వేసింది. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌ను పర్యాటక బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఇప్పుడు ఇరు జట్ల మధ్య శుక్రవారం నాలుగో టీ20 పుణెలో జరుగనుంది. భారత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గితే సిరీస్‌ వశమవుతుంది. అటు మరోసారి ప్రత్యర్థిని దెబ్బతీసి సిరీస్‌ ఫలితాన్ని ఆఖరి మ్యాచ్‌కు తీసుకెళ్లాలని బట్లర్‌ సేన కృత నిశ్చయంతో ఉంది.


శాంసన్‌పై ఒత్తిడి

చివరి మూడు టీ20ల్లోనూ భారత బౌలర్లు ఇంగ్లండ్‌ భారీ స్కోర్లను అడ్డుకోగలుగుతున్నారు. కానీ రాజ్‌కోట్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం దెబ్బతీసింది. స్పిన్నర్‌ వరుణ్‌ ఐదు వికెట్లతో అండగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. భారత్‌ ఛేదనలో మంచు ప్రభావం లేకపోవడంతో ఇంగ్లండ్‌ బౌలర్లు బంతిపై పట్టు సాధించారు. ఇక ఓపెనర్‌ శాంసన్‌ను షార్ట్‌ పిచ్‌ బంతుల బలహీనత వెంటాడుతోంది. ఈ సిరీ్‌సకు ముందు భీకర ఫామ్‌లో ఉన్నా.. తాజా సిరీ్‌సలో వరుసగా 26, 5, 3 రన్స్‌తో నిరాశపరిచాడు. అలాగే రింకూ సింగ్‌ అందుబాటులో ఉండడంతో ధ్రువ్‌ జురెల్‌పై వేటు పడవచ్చు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ క్రీజులో కుదురుకోవాల్సి ఉంది. నేటి కీలక మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో మహ్మద్‌ షమితో పాటు అర్ష్‌దీ్‌పను కూడా ఆడించాలనుకుంటే సుందర్‌ను తప్పించవచ్చు.


అదే జోరు చూపాలని..

కీలక సమయంలో బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంతో మూడో టీ20లో ఇంగ్లండ్‌ విజయం సాధించగలిగింది. ఓపెనర్‌ డకెట్‌, లివింగ్‌స్టోన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ భారత్‌ ఆశలను వమ్ము చేసింది. బౌలింగ్‌లో స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ భారత బ్యాటర్లకు ముకుతాడు వేయడంలో ముందుంటున్నాడు. ఏదేమైనా రెండు విభాగాల్లోనూ మరోసారి రాణించి పుణెలో గెలిచి తీరాలన్న కసితో ఇంగ్లండ్‌ ఉంది.

తుది జట్లు (అంచనా): భారత్‌: శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌, సుందర్‌/అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌, షమి, వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌: సాల్ట్‌, డకెట్‌, బట్లర్‌ (కెప్టెన్‌), బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, స్మిత్‌, ఒవర్టన్‌, కార్స్‌, ఆర్చర్‌, ఉడ్‌, రషీద్‌.

పిచ్‌: ఎంసీఏ స్టేడియం సహజంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంటుంది. అయితే ఆరంభంలో పేసర్లు కూడా ప్రభావం చూపవచ్చు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 166గా ఉంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:27 AM