Share News

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:55 PM

క్రికెట్ ప్రేమికులను రెండు నెలలకు పైగా ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ మజాను మరింత పెంచేందుకు ప్రముఖ సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ ముందుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లను 30కు పైగా నగరాల్లోని తన సినిమా హాళ్లలో ప్రదర్శించేందుకు ఆసక్తి చూపుతోంది.

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
IPL matches in PVR cinemas

మరికొద్ది గంటల్లో ఐపీఎల్-2025 (IPL 2025) ప్రారంభం కాబోతోంది. క్రికెట్ ప్రేమికులను రెండు నెలలకు పైగా ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ మజాను మరింత పెంచేందుకు ప్రముఖ సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) ముందుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లను 30కు పైగా నగరాల్లోని తన సినిమా హాళ్లలో ప్రదర్శించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో ఒప్పందం కుదుర్చుకుంది (IPL matches in PVR cinemas).


శనివారం జరిగే ఐపీఎల్ ప్రారంభత్సోవ వేడుకతో ఐపీఎల్ ప్రసరాలు పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్‌లో ప్రారంభమవుతాయి. వీకెండ్ మ్యాచ్‌లతో పాటు ప్లే-ఆఫ్స్, ఫైనల్‌ను పీవీఆర్ ఐనాక్స్‌లో వీక్షించవచ్చని పీవీఆర్ ఐనాక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. డాల్బీ సౌండ్, హై క్వాలిటీ విజువల్స్, చక్కటి సీటింగ్‌ సదుపాయాలు కలిగిన పీవీఆర్ సినిమాస్‌లో మ్యాచ్ చూస్తే నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొంది. గతేడాది కూడా పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం జరిగింది.


గతేడాది లభించిన ఆదరణతో ఈ ఏడాది కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శించాలని పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం నిర్ణయించుకుంది. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల మెట్రో నగరాలు, పట్టణాలతో పాటు టైర్-2, టైర్-3 సిటీల్లోనూ పీవీఆర్ సినిమాస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శిస్తారు. అలాగే ఉత్తరాదిన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ మొదలైన రాష్ట్రాల నగరాలు, టైర్-2, టైర్-3 సిటీల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శిస్తారు.

ఇవి కూడా చదవండి..

IPL 2025, KKR vs RCB: ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి.. టాస్ గెలిస్తే ఏం చేయాలి..


RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 03:55 PM