Share News

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:56 PM

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్‌ అల్లర్లలో కీలక నిందితుడైన షాహిమ్ ఖాన్‌ విషయంలో యాక్షన్‌కు దిగింది మహా సర్కార్. ఖాన్ అక్రమనిర్మాణాలపై చర్యలు చేపట్టింది.

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..
Nagpur Riots Latest Update

నాగ్‌పూర్, మార్చి 24: నాగ్‌పూర్ మత హింసలో కీలక నిందితుడైన షాహిమ్ ఖాన్‌‌కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) ఉక్కుపాదం మోపింది. ఈరోజు (సోమవారం) ఉదయం ఖాన్ నివాసంతో పాటు అతడికి చెందిన ఇతర నిర్మాణాలను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MDP)కి చెందిన ప్రముఖ నాయకుడు షాహిమ్‌ ఖాన్.. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో నాగ్‌పూర్ అల్లర్లకు కారకుడయ్యాడని.. రాజద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖాన్ జైలులో ఉన్నారు.


అయితే అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే ఖాన్‌ను నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ నోటీసులకు స్పందించకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నాగ్‌పూర్ యశోధ్‌నగర్‌ ప్రాంతంలోని సంజయ్‌బాగ్ కాలనీలో ఉన్న నివాసం ఖాన్ భార్య పేరుమీద రిజిస్ట్రర్ అయి ఉంది. అయితే అక్రమ నిర్మాణాలపై ఎన్‌ఎమ్‌సీ హెచ్చరికలు చేస్తూ నోటీసులు ఇచ్చినప్పటకీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో ఆ భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్


కాగా.. ఈనెల 17న ఛత్రపతి శంభాజీనగర్‌లో ఔరంగజేబు సమాధాని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూపరిషత్ నేతృత్వంలో నిరసన జరిగింది. అయితే ఈ నిరసనల్లో మతపరమైన శాసనాలు ఉన్న చాదర్ దహనమైందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు దహనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు సహా మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. సోషల్ మీడియాలో వదంతులకు కారణమైన షాహిమ్‌ ఖాన్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. అలాగే దాదాపు 50 మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన నాలుగు ఎఫ్‌ఐఆర్లలోనూ వీరి పేర్లు ఉన్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 200 మంది నిందితులను గుర్తించామని, మరో వెయ్యి మందిని సీసీఫుటేజ్ ఆధారంగా గుర్తించనున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు.


అయితే నాగ్‌పూర్‌లో ఔరంగాజేబుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోలను మార్పులు చేసి ఖాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్లే అల్లర్లు జరిగినట్లు మహారాష్ట్ర పోలీసుల సైబర్ సెల్ విభాగం తెలిపింది.


ఇవి కూడా చదవండి

Check Meat Quality Tips: మీరు తీసుకుంటున్న చికెన్, మటన్ తాజాదేనా..

Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే

Read Latest National News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 01:59 PM