ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపుపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:29 PM
): లే అవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపులపై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు.

- కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
వాంకిడి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లే అవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపులపై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. వాంకిడి గ్రామపంచాయతీ కార్యాల యంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబందించిన వివరాలను కార్యదర్శి శివను సోమవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకంలో ఎల్‌ఆర్‌ఎస్-2022లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులఉ ఈ నెల 31వ తేదీలోగా 100 శాతం చెల్లించిన వారికి 25 శాతం రుసుము మినహాయింపు ఉందని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇంటిపన్నులు 100 శాతం వసూలు చేయాలని గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చెపట్టాలన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వార్డులు, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన హెచ్ నర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి వైద్యాధికారిని ఆదేశించారు. వ్యాక్సినేషన్ సెంటర్‌ను తనిఖీ చేసి పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందించాలని, గర్భిణులకు ప్రతీ నెల పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ అవరణలో చేపట్టిన ఇందిరమ్మ నమూనా నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో ఖాజా అజీజోద్దిన్, వైద్యాధికారి వినయ్, తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
వాంకిడి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. 100 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లతోపాటు అత్యవసర సేవల నిమిత్తం వైద్యసిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.