Share News

రక్తదానం చేసేవారందరూ ప్రాణదాతలే

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:25 PM

రక్తదానం చేసినవారందరు ప్రాణదాతలే అని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం సోమగూడెం కల్వరి మినస్ర్టీస్‌ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి రక్తం అవసరం ఉంటుందని తెలిపారు.

రక్తదానం చేసేవారందరూ ప్రాణదాతలే
రక్తదానం చేస్తున్న యువకులు, చిత్రంలో కలెక్టర్‌ కమార్‌ దీపక్‌, కల్వరి మినస్ర్టీస్‌ చర్చి నిర్వాహకులు

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కాసిపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసినవారందరు ప్రాణదాతలే అని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం సోమగూడెం కల్వరి మినస్ర్టీస్‌ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. ఎండాకాలంలో రక్తనిధి కేంద్రంలో రక్తం కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించి సోమగూడెం కల్వరి మినీస్ర్టిస్‌, మంచిర్యాల రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారు రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రక్తదాన శిబిరాల వల్ల రక్తం నిల్వలు పెరుగుతాయని దీంతో రక్తం అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుందన్నారు. బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రక్తదాన శిబిరంలో 83 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కల్వరి మినిస్ర్టీస్‌ నిర్వాహకులు ప్రవీణ్‌, షారోన్‌లను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్‌, కాంగ్రెస్‌ నాయకుడు ముత్తినేని రవికుమార్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి మంచిర్యాల కేంద్రం ఇన్‌చార్జీ మధుసూదన్‌రెడ్డి, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:25 PM