క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:31 PM
క్షయవ్యాధి రహిత జిల్లాగా తిర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సీతారాం అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.

- డీఎంహెచ్‌వో సీతారాం
ఆసిఫాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి రహిత జిల్లాగా తిర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సీతారాం అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధిపై ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే మందులు ఉచితంగా ఇస్తామని తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేపట్టారు. కార్యక్రమంలో సిబ్బంది అజీముద్దీన్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్: మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. క్షయ వ్యాధి నిర్మూలన, వ్యాధి లక్షణాలపై ప్రజలకు ఆవగాహన కల్పించారు. వైద్యాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని వైద్యాధికారి అశ్విని సూచించారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.