Share News

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:28 PM

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పలువురు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగింది.

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
కన్నెపల్లిలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కన్నెపల్లి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పలువురు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీని ప్రారంభించారు. కన్నెపల్లి మండల కేంద్రంతో పాటు జన్కాపూర్‌, జజ్జరవెల్లి, టేకులపల్లి, వీరాపూర్‌, ముత్తాపూర్‌, నాయకునిపేట, మెట్‌పల్లి, లింగాల గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ మాధవరపు నర్సింగరావు, మండల అధ్యక్షుడు పప్పుల రామాంజనేయలు ప్రారంభించారు. కార్యక్ర మంలో యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు అంకూస్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయి, మాజీ సర్పంచు చంద్రయ్య, నాయకులు పాల్గొన్నారు.

వేమనపల్లి (ఆంధ్రజ్యోతి): వేమనపల్లి, నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట, దస్నాపూర్‌, సుంపుటం, జిల్లెడ , లక్ష్మీపూర్‌ గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్‌ రమేష్‌ ప్రారంభిం చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆర్‌. సంతోష్‌కు మార్‌, కాంగ్రెస్‌ నాయకులు సాబీర్‌ ఆలీ, ముల్కల సత్యనారాయణ, గాలి మధు, ఒడిల రాజన్న, తోకల రాంచందర్‌, పూర్ణచంద్రరెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.

భీమిని (ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అధికారులు, నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాధం లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ బికర్ణ దాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మాధవరపు నర్సింగరావు, కన్నెపల్లి మండల అధ్యక్షుడు రామాంజనే యులు, మాజీ ఎంపీటీసీ దుర్గం ప్రభాకర్‌, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమారం (ఆంధ్రజ్యోతి): మండలంలో 13 రేషన్‌ షాపులు ఉండగా కొత్తపల్లి గ్రామంలోని రేషన్‌ మినహా 12 రేషన్‌ షాపుల్లో బుధవారం సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందని తహసీల్దార్‌ సదానందం తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్‌ అంజమ్మ, కాంగ్రెస్‌ జిల్లా, మండల నాయకులు చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోడేటి రవి, మాజీ సర్పంచు గద్దె రాంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:28 PM